Niveda Thomas: నివేదా నీకు పెళ్లా..?

Niveda Thomas: మలయాళీ ముద్దు గుమ్మ నివేదా థామస్ ని సోషల్ మీడియాలో అభిమానులు నీవేదా నీకు పెళ్లా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం తాజాగా ఆమె తన ఖాతాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టడమే. వకీల్ సాబ్, శాకిని ఢానికి చిత్రాల తర్వాత అభిమానులకి, ప్రేక్షకులకి దూరంగా ఉన్నారు నివేదా. అంతకముందు సినిమాలతో సంబంధం లేకపోయినా తన సోదరుడితో కలిసి డాన్స్ వీడియోలను, ఫన్నీ వీడీయోలను పోస్ట్ చేస్తూ అందరికీ టచ్ లో ఉండేవారు.

కానీ, ఎందుకనో సడన్ గా సైలెంట్ అయిపోయింది. ఆ మధ్య నివేదా బాగా లావెక్కినట్టుగా ఒక వీడియో నెట్టింట బాగా చక్కర్లు కొట్టింది. ఈ మధ్యే ఓ కొత్త చిత్రం ఒప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి గానీ, ఎటువంటి క్లారిటీ మాత్రం లేదు. వాస్తవానికి నివేదా మంచి టాలెంటెడ్. ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా ప్రదర్శిస్తారు. చేసిన ప్రతీ పాత్ర మంచి పేరు తెచ్చింది. అయినా ఎందుకనో స్టార్ హీరోయిన్ రేంజ్ కి మాత్రం చేరుకోలేకపోయారు.

niveda-thomas-latest-movie-35-poster-released

Niveda Thomas: గుడ్ న్యూస్ చెప్పబోతున్నారనీ మాట్లాడుకుంటున్నారు.

ఇక తాజాగా నివేదా పెట్టిన పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. చాలా కాలం అయిపోయింది. అయినా చివరికి..అంటూ లవ్ ఏమోజీని జత చేసి రాసుకొచ్చిన పోస్ట్ ని పెట్టారు. దాంతో అభిమానులు, సినీమా లవర్స్ “త్వరలో నివేదా పెళ్లి పీటలెక్కబోతోందని మాట్లాడుకుంటున్నారు. మరికొందరేమో కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పబోతున్నారనీ మాట్లాడుకుంటున్నారు. కాగా, చిత్ర పరిశ్రమలో మాత్రం ఇప్పటికే నివేదా థామస్ ఒక మల్టీ లాంగ్వేజ్ మూవీ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఆ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ అయి ఉండొచ్చుననే ఊహాగానాలు మరోవైపు వినిపించాయి.

niveda-thomas-latest-movie-35-poster-released

అదే ఇప్పుడు నిజం అయింది. నివేదా థామస్ ప్రధాన పాత్రలో ప్రియ‌ద‌ర్శి, విశ్వ‌దేవ్ కీలక పాత్రల్లో టాలీవుడ్ టాల్ హీరో, నిర్మాత రానా దగ్గుబాటి నిర్మాణంలో 35 అనే చిత్రం తయారవుతోంది. చిన్న కథ కాదు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా అప్‌డేట్ ని నివేదా పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఈ ఆగస్టు 15న భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరికొన్ని అప్‌డేట్స్ రానున్నాయి. ఈ చిత్రానికి నంద కిషోర్ దర్శకుడు. ఇక సాయి పల్లవి, నిత్యా మేనన్ ల మాదిరిగా కాంప్రమైజ్ కాకపోవడం కథ..అందులో తన పాత్ర నచ్చితేనే సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని అందుకే ఈ గ్యాప్ వచ్చిందనీ చెప్పుకుంటున్నవారు లేకపోలేదు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Health Care:రోజు 8 గంటలు నిద్రపోయినా నీరసంగా ఉందా? కారణం ఇదే తెలుసా?

Health care: మనం ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే సరైన తిండితో పాటు నిద్ర కూడా ఎంతో అవసరం. సరైన నిద్ర…

1 day ago

Bkack Dress: పూజ సమయంలో బ్లాక్ డ్రెస్ వేసుకోకూడదు..కారణం ఇదేనా?

Black Dress: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా పూజ కార్యక్రమాలు జరిగినప్పుడు శుభప్రదమైన దుస్తులను ధరించడం ఆనవాయితీగా వస్తుంది.…

1 day ago

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

2 weeks ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

2 weeks ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

2 weeks ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

2 weeks ago

This website uses cookies.