Nirjala Ekadashi: మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇలా ప్రతినెల ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ప్రత్యేకంగా పూజలు చేసే ఆరాధిస్తూ ఉంటాము.జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున నిర్జల ఏకాదశి ఉపవాసం చేస్తారు. ఏకాదశి ఏడాది జూన్ 18వ తేదీ వచ్చింది ఇక ఈరోజు ప్రత్యేకంగా విష్ణుమూర్తికి పూజలు చేస్తాము విష్ణుమూర్తికి పూజలు చేయడం వల్ల సకల సంపదలతో పాటు అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి.
నిర్జల ఏకాదశి రోజు ఉదయాన్నే స్నానం చేసి విష్ణుమూర్తిని ప్రత్యేక పూజలు అలంకరించి పూజ చేయాలా అలాగే ఈరోజు ఉపవాసం ఉండటం ఎంతో మంచిది. ఇక ఏకాదశి రోజు లక్ష్మి విష్ణు మూర్తులకు పూజ చేయటం ఎంతో పుణ్యఫలం. ఈ ఏకాదశి రోజు లక్ష్మీదేవికి కొబ్బరి కాయను సమర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారని పండితులు చెబుతున్నారు.
ఇక చాలా కాలం నుంచి పెళ్లి కాని వారు కోరుకున్న వ్యక్తి తమ జీవితంలోకి రావాలి అంటే నిర్జల ఏకాదశి రోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి. ఇక ఈరోజు విష్ణుమూర్తికి తులసి మాలను స్వామివారికి సమర్పించడం వల్ల కోరుకున్న వ్యక్తిని జీవితంలోకి వస్తారు ఇక స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ తులసి మాలను సమర్పించడం కోసం ఏకాదశి రోజు తులసి మొక్కను తెంపడం పూర్తిగా నిషేధం. ముందు రోజే తులసి మాలను తయారుచేసి పెట్టుకోవాలి కానీ ఏకాదశి రోజు తులసి చెట్టును ముట్టుకోవడం లేదంటే తెంపడం వల్ల విష్ణుమూర్తి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది.