Niharika: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల వివాహం ఎంతో అంగరంగ వైభవంగా ఇటలీలో జరిగిన సంగతి మనకు తెలిసిందే. వీరి వివాహం నవంబర్ ఒకటవ తేదీ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఇలా ఈ పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరగడమే కాకుండా పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పెళ్లి ఫోటోలు ఒక్కొక్కటి బయటకు రావడంతో మెగా అభిమానులు ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు.
ఈ పెళ్లి ఫోటోలను చూస్తే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఎంతో ఘనంగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ ఫోటోలను మెగా కుటుంబ సభ్యులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిహారిక సైతం తన అన్నయ్య వదినలతో కలిసి దిగిన ఫోటోని ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఇక ఈ ఫోటోని షేర్ చేసిన ఈమె వదిన వచ్చేసింది అంటూ సంతోషం వ్యక్తం చేస్తూ తన వదినకు వెల్కం చెబుతూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజెన్స్ నిహారిక పట్ల దారుణమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు.
నిహారిక చేసిన ఈ పోస్టుపై కొందరు నెటిజెన్స్ స్పందిస్తూ వదిన వచ్చింది సరే మరి నీ భర్త ఎక్కడ అంటూ ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు. అలాగే మరికొందరు వదిన వచ్చింది.. నీ భర్త వదిలేసాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే అయినా నువ్వు వీళ్లకు కాస్త దూరంగా ఉండు. వీరికి దగ్గరగా ఉంటే నీ మాదిరే తను కూడా విడాకులు తీసుకోవాల్సి వస్తుంది అంటూ నిహారిక పోస్టుపై దారుణమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిహారిక వివాహం గత రెండు సంవత్సరాల క్రితం ఎంతో ఘనంగా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చి విడిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నేటిజన్స్ ఈమె విషయంలో ఇలాంటి కామెంట్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
This website uses cookies.