Tue. Feb 10th, 2026

    Nidhhi Agerwal : పక్కా హైదరాబాదీ భామ ఇస్మార్ట్ బ్యూటీ నిధీ అగర్వాల్ తెలుగులో హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం “హరిహర వీరమల్లు” సినిమాలో నటిస్తోంది. ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తెలుగులో నిధీ అగర్వాల్ ప్రస్తుతం నటిస్తున్న ఈ సినిమాపై చాలా నమ్మకాలు పెట్టుకుంది.

    nidhhi-agerwal-latest-pics-vairal-with-pet-dog
    nidhhi-agerwal-latest-pics-vairal-with-pet-dog

    ఎందుకంటే, ఇప్పటివరకూ తెలుగులో సాధించిన హిట్ ఒక్కటంటే ఒక్కటే. మొదటి సినిమా ‘సవ్యసాచి’, రెండవ సినిమా ‘మిస్టర్ మజ్ఞు’ ఆశించిన సక్సెస్‌లను ఇవ్వలేదు. కానీ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి మాసీవ్ హిట్ సాధించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మాత్రం కమర్షియల్ హీరోయిన్‌గా నిలబెట్టింది. ఈ మూవీ తర్వాత మళ్ళీ నిధికి తెలుగులో హిట్ అనేది దక్కలేదు. అటు తమిళంలో మాత్రం హీరోయిన్‌గా నటించిన రెండు సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి.

    Nidhhi Agerwal : ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

    అయితే, ఎన్నో అంచనాలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ సాధిస్తే అమాంతం నిధి అగర్వాల్ రేంజ్ మారిపోతుంది. ఈ సినిమా పలు కారణాల చేత ఆలస్యమవుతోంది. అందుకే, సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా తన అభిమానులకి..నెటిజన్స్‌కి టచ్‌లో ఉంటోంది. ఎప్పటికప్పుడు రకరకాల ఫొటో షూట్స్ చేసి తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తోంది.

    ఈ క్రమంలోనే తాజాగా అమ్మడు మోకాళ్ళపైకి పొట్టి గౌను వేసుకొని తన పెంపుడు కుక్కతో ఫోజులిస్తూ పిక్స్ దిగింది. ఇందులో చూస్తే నిధి ఎద అందాలు కనిపించీ కనిపించనట్టుగా ఉంటూ జనాలను ఊరిస్తున్నాయి. ఇక ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నిధి తన కుక్కపిల్లకి వెంట్రికలను కత్తిరిస్తోంది. ట్రిమ్మింగ్ మిషన్‌ను ఓ చేతిలో పట్టుకొని చూపిస్తూ స్మైల్ ఇస్తూ ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.