Holi: మన సనాతన ధర్మంలో ఎన్నో పండుగలు ప్రతి ఏడాది వస్తూ ఉంటాయి. వాటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. అలాగే ప్రాంతాల బట్టి ఆ వేడుక ప్రాధాన్యత కూడా ఉంటుంది. హోలీ వేడుకని ఉత్తరాది రాష్ట్రాలలో చాలా ఘనంగా జరుపుకుంటారు. అలాగే దక్షిణాది రాష్ట్రాలలో దీపావళి వేడుకని వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగలు అన్ని కూడా తరతరాలుగా మన నాగరికతలో భాగంగా వస్తూ ఉన్నవే. అయితే మారుతున్న కాలంతో పాటు పండగని సెలబ్రేట్ చేసుకునే విధానం మారుతుంది. అయినా కాని ఆచార్య వ్యవహారాలలో ఎలాంటి మార్పులు ఉండవు.
ఇక 7, 8 తేదీలలో హోలీ సెలబ్రేషన్ దేశ వ్యాప్తంగా గ్రాండ్ గా జరుపుకుంటారు. అయితే ఈ వేడుకలని పెళ్ళైన కొత్తజంట సెలబ్రేట్ చేసుకోవడం లో కొన్ని ఆచార్య వ్యవహారాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. కొత్తగా పెళ్ళైన జంట హోలీ వేడుకలలో నల్లని దుస్తులు ధరించకూడదు. నలుపు రంగు ప్రతికూల శక్తులని ఆకర్షిస్తుంది. దీని వలన వారి జీవితంలో చెడు జరిగే అవకాశం ఉంటుంది. నలుపు రంగు దుస్తులు ధరిస్తే దుష్ట శక్తులని ఆహ్వానించినట్లే . హోలికా దహనం చేసే రోజున పెళ్లి కూతురు అత్తమామల ఇంట్లో వేడుకలు జరుపుకోకూడదు.
ఇలా జరుపుకుంటే వారి ఇంట్లో ఆనందం దూరమవుతుందని అంటున్నారు. ఇది అశుభంగా పేర్కొంటున్నారు. అలాగే పెళ్ళైన వారు హోలీ పర్వదినాలలో వివాహ కానుకలని ఎట్టి పరిస్థితిలో ఎవరికీ దానం చేయకూడదు. అలా చేస్తే మనకి లభించిన ఆశీర్వాదాలు వేరొకరికి ఇచ్చేసినట్లు అవుతుంది. వారి కష్టాలని మనం స్వీకరించినట్లు అవుతుంది. అలాగే హోలస్టిక్ అనేది కొత్త జంటకి కలవడానికి సరైన సమయం కాదు. ఈ సమయంలో వారు శారీరకంగా దూరం ఉండటం మంచిది అని పండితులు చెబుతున్నారు. ఇలా హోలీ సెలబ్రేషన్స్ సంబరాలలో మునిగిపోయి ఈ ఆచారాల్ని ఎట్టి పరిస్థితిలో విస్మరించవద్దు అని పందితులు చెబుతున్న మాట.
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…
This website uses cookies.