Technology: ఆ దేశ ఎన్నికలలో హ్యూమన్ మైండ్ నుంచి ఎప్పటికప్పుడు సరికొత్త విజ్ఞాన ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి. మానవ మేధస్సు తన స్వప్రయోజనాల కోసం కృతిమ మేధస్సుని సృష్టిస్తుంది. ఈ కృత్రిమ మేధస్సుని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇప్పటికే సాంకేతిక ప్రపంచంలో ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాలా కీలక భూమిక పోషిస్తుంది. గూగుల్ అంతర్జాల ప్రపంచం అంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తోనే నడుస్తుంది. అలాగే అమెజాన్, మైక్రో సాఫ్ట్, అలీబాబా, ఐబిఏం లాంటి కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించుకుంటున్నాయి.
ఇక మానవ సమాజంలో కూడా కృత్రిమ మేధస్సు ఒక భాగం అయిపొయింది. స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీద తెలియకుండానే ఆధారపడుతున్నారు. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. భవిష్యత్తులో మానవ ఉద్యోగాలని కూడా ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆక్రమిస్తుంది. రోజువారీ ఉద్యోగాలపై కూడా భవిష్యత్తులో ప్రభావం చూపిస్తుంది. ఐటీ కంపెనీలలో కొత్త కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. మనిషి ప్రమేయం లేకుండానే రోబోల కృత్రిమ మేధస్సుని ఇప్పుడు చాలా కంపెనీలు ఉపయోగించుకుంటు న్నాయి.
ఇదిలా ఉంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరణలో సరికొత్త అధ్యాయం మొదలైంది. డెన్మార్క్ దేశంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో ఒక రాజకీయ పార్టీ కూడా పుట్టింది. అసలు పార్టీ అధ్యక్షుడి అవసరం లేకుండానే ఈ రాజకీయ పార్టీ పనిచేస్తుంది. మైండ్ ఫ్యూచర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ కంప్యూటర్ లార్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే పార్టీని రూపొందించింది. దానికి డేనిష్ సింథటిక్ పార్టీ అని పేరు కూడా పెట్టారు. ఈ ఏడాది మే నెలలో ఈ కొత్త రాజకీయ పార్టీ అనౌన్సమెంట్ జరిగింది. డెన్మార్క్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కృత్రిమ పార్టీ పోటీకి దిగేందుకు కూడా ఈ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది.
ఎన్నికలలో ఇప్పటి వరకు ఓటు వేయని 20 శాతం మంది ప్రజలకి ప్రత్యామ్నాయం గా ఈ పార్టీని తీసుకొచ్చినట్లు మైండ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థ ప్రకటించింది. 1970 నుంచి పోటీ చేస్తూ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన చిన్న పార్టీల సిద్ధాంతాల ని ప్రోగ్రామింగ్ చేయడం ద్వారా ఈ డేనిష్ సింథటిక్ పార్టీ సిద్ధం చేసి అనౌన్స్ చేసినట్లు తెలియజేశారు. మరి ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పార్టీ డెన్మార్క్ ఎన్నికలలో పోటీ చేసే అర్హతని సంపాదిస్తుందా లేదా అనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఇక వేళ పోటీ చేస్తే మాత్రం అది కచ్చితంగా చరిత్ర పుస్తకాలలోకి ఎక్కుతుంది.