Beauty Tips: చలికాలం వచ్చిందంటే చాలు పాదాలు పగుళ్ళ సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. చలికాలంలో పాదాలు ఎక్కువగా చీలి నడవడానికి కూడా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఇలా ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే ఎన్నో రకాల క్రీములు వాడిన పాదాల సంరక్షణ చేపట్టిన కూడా ఇలా పాదాల పగుళ్లు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలా పాదాల పగుళ్ళ సమస్యతో బాధపడేవారు ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు.
ఆయుర్వేద ప్రకారం వేపాకుకి ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది. వేపాకులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి అందుకే ఆయుర్వేదంలో వేపాకును విరివిగా ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా వేపాకును ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో చర్మ సమస్యల నుంచి రక్షించడానికి దోహదం చేస్తుంది.
ఈ క్రమంలోనే పాదాల పగుళ్ళ సమస్యతో బాధపడేవారు కాస్త వేపాకును తీసుకొని శుభ్రంగా కడిగి మెత్తని మిశ్రమంలా తయారు చేయాలి. ఈ మిశ్రమంలోకి పావు టీస్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు అరగంట పాటు పాదాలకు పట్టించుకుని అనంతరం చల్లనీటితో శుభ్రం చేసుకోవడం వల్ల పాదాల పగుళ్ళ సమస్య తగ్గిపోవడమే కాకుండా పాదాలు కూడా చాలా మృదువుగా మారిపోతాయి.