Wed. Jan 21st, 2026

    Tollywood: నయనతార, త్రిష అంటే నిర్మాతలు భయపడుతున్నారు..? ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే టాక్ వినిపిస్తోంది. సౌత్ లో ఇప్పుడు బాగా ఫాంలో ఉన్న హీరోయిన్ త్రిష కృష్ణన్, నయనతార. వీరు సీనియర్ హీరోలకి పర్ఫెక్ట్‌గా సూటయ్యే హీరోయిన్స్. అంతేకాదు, ఫాంలో ఉన్నవాళ్ళు కాబట్టి వీరి వల్ల సినిమా బిజినెస్ కూడా బాగా జరుగుతోంది.

    నయనతార, త్రిష హీరోయిన్స్ అంటే ఓటీటీ నుంచి శాటిలైట్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి నిర్మాతలకి. దాంతో వీరి రెమ్యునరేషన్ గట్టిగా పెంచేశారు. ఇప్పుడు నయనతార సినిమా ఒప్పుకుంటే 12 కోట్ల వరకూ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని ఇటీవల ఒక వార్త వచ్చి బాగా వైరల్ అయింది. ఈ బ్యూటీ ఇంతగా డిమాండ్ చేయడానికి కారణం బాలీవుడ్ మూవీ జపాన్.

    nayana tara trisha demands for more remuniration
    nayana tara trisha demands for more remuniration

    Tollywood: అంటే వీరిద్దరు 10 నుంచి 12 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.

    బాలీవుడ్ లో బాధ్షా షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ జపాన్ చిత్రాన్ని రూపొందించాడు. దాదాపు 1000 కోట్లు రాబట్టింది. దాంతో నయనతార రెమ్యునరేషన్ బాగా డిమాండ్ చేస్తుంది. ఇక 96 సినిమాతో ఫాంలోకి వచ్చిన త్రిష అన్నీ పాన్ ఇండియా సినిమాలనే ఒప్పుకుంటుంది. అదీ కాక ఇప్పుడు త్రిష అందం చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. నాలుగు పదుల వయసులో కూడా ఇంత గ్లామర్ ఎలా మేయిన్‌టైన్ చేస్తుందో జనాలకి అర్థం కావడం లేదు.

    ఇటీవల కోలీవుడ్‌లో విజయ సరసన నటించి హిట్ అందుకుంది. దాంతో మన టాలీవుడ్ మేకర్స్ నయనతార కాకుండా త్రిష ని సినిమాలో ఫిక్స్ చేసుకుందామనుకుంటే ఆమె కూడా 10 కోట్ల వరకూ డిమాండ్ చేస్తుందట. పాన్ ఇండియన్ సినిమా అంటే వీరిద్దరు 10 నుంచి 12 కోట్లు డిమాండ్ చేస్తున్నారని మన తెలుగు నిర్మాతలు ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఒక్క హీరోయిన్ కే ఇవ్వలేక భయపడుతున్నారట. అందుకే, చాలావరకు రష్మిక మందన్న, శ్రీలీల లాంటి వారితో సరిపెట్టుకుంటున్నారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.