Wed. Jan 21st, 2026

    Yuvagalam: టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడిగా ఏపీ రాజకీయాలలోకి వచ్చిన నారా లోకేష్ మొదటి ఎన్నికలలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే పార్టీలో చంద్రబాబు తర్వాత నెంబర్ 2 అనే హోదాని మాత్రం సొంతం చేసుకోగలిగారు. పార్టీకి అన్నితానై బలమైన టీమ్ ని తయారు చేసుకున్నాడు. వారితో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిణితి చెందే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే నారా లోకేష్ పై ప్రత్యర్ధులు పప్పు అంటూ ఆరోపణలు చేస్తూ ఉంటారు. అయితే తన రాజకీయ పరిణితిని పెంచుకోవడంతో పాటు నాయకుడిగా తనని తాను ప్రాజెక్ట్చేసుకోవడానికి నారా లోకేష్ పాదయాత్రని ఎంపిక చేసుకున్నారు.

    Nara Lokesh: 17వ రోజు కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర.. నేడు తిరుపతి జిల్లాలోకి అడుగు.. - Telugu News | Nara lokesh yuva galam padayatra day 17 continue in chittoor district au58 | TV9 Telugu

    అయితే లోకేష్ పాదయాత్ర చేస్తానని చెప్పినపుడు కనీసం రెండు జిల్లాల్లో కూడా తిరగలేడు అంటూ చాలా మంది విమర్శలు చేశారు. వాటిని ఎదుర్కొంటూనే తన ప్రయాణం మొదలు పెట్టారు. యువగళం పేరుతో కుప్పం నుంచి పాదయాత్ర మొదలు పెట్టిన లోకేష్ వంద రోజుల యాత్రని పూర్తి చేసుకున్నారు. రాయలసీమలో చాలా జిల్లాలు ఇప్పటికే కవర్ చేశారు. ఇక నారా లోకేష్ పాదయాత్రని అధికార పార్టీ వైసీపీ ఆరంభంలో లైట్ గా తీసుకున్న తర్వాత పద్ధతి మార్చారు. లోకేష్ పర్యటిస్తున్న ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై విమర్శలు చేయడంతో  అవి పార్టీ మైలేజ్ ని దెబ్బతీస్తున్నాయని ఎదురుదాడి మొదలు పెట్టారు.

    Nara Lokesh Yuvagalam | Nara Lokesh Yuvagalam : గెలవడం కాదు..నిలవడమే టార్గెట్ గా నారా లోకేష్ యువగళం | ABP Desam

    ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎదురుదాడి చేస్తూ ఉండటంతో ప్రజలలో లోకేష్ ఆదరణ మరింత పెరుగుతూ పోతోంది. బలమైన నాయకుడిగా చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలు అందుకునే వ్యక్తిగా తనని తాను ప్రాజెక్ట్ చేసుకోవడంలో, పార్టీ క్యాడర్ కి నమ్మకం కలిగించడంలో లోకేష్ విజయం సాధించాడని చెప్పాలి. ఒక వేళ వచ్చే ఎన్నికలలో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం కచ్చితంగా నారాలోకేష్ పాదయాత్ర బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లే లెక్క. అలాగే క్యాడర్ కూడా భవిష్యత్తు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తనని ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి.