Nandamuri Taraka Ratna : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హీరో తారకరత్న గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కొన్నిగంటల క్రితం కన్నుమూశారు. నందమూరి మోహనకృష్ణ ఒక్కగానొక్క కొడుకు తారకరత్న. ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించాడు. అయితే, స్టార్ హీరోగా నిలదొక్కుకోలేకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించారు.
హీరోగా కంటే తారకరత్నకి విభిన్నమైన పాత్రలే మంచి పేరు తెచ్చాయి. కటౌట్‌కి అందరూ నెగిటివ్ రోల్స్ చేస్తే లాంగ్ టైం సినిమాలు చేస్తూ ఉంటావని సలహాలిచ్చారు. తారకరత్న కూడా ఆ దిశగానే సినిమాలను ఎంచుకుంటున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే ఇంకో వైపు రాజకీయాలలోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. తేదేపా యంగ్ లీడర్ నారా లోకేష్ గత నెల మొదలుపెట్టిన పాదయాత్రలో తారకరత్న కూడా భాగమయ్యారు. లోకేష్‌తో కలిసి పాద యాత్రను చేస్తున్నారు.
Nandamuri Taraka Ratna : దాదాపు 23రోజుల పాటు ఆసుపత్రిలో..
ఈ క్రమంలో ఆయనకి హఠాత్తుగా గుండెపోటు వచ్చి నడుస్తూనే కుప్పకూలిపోయారు. ప్రాథమిక చికిత్స అనంతరం తారకరత్నను బెంగుళూరు తరలించారు. అక్కడ చేరిన రెండు రోజులు ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని వార్తలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత గుండెమార్పిడి జరిగిందని నెమ్మదిగా కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్తూ వచ్చారు. దాంతో నందమూరి అభిమానులు, ప్రేక్షకులు, తేదేపా కార్యకర్తలందరు కూడా ఇక తారకరత్నకి ఏ ఇబ్బందీ లేదనీ..త్వరలో తిరిగి ఇంటికి చేరుకుంటారనీ నమ్మకంగా ఉన్నారు.
ఇంతలోనే ఆయన తుది శ్వాస విడిచి తిరిగిరాని లోకాలను వెళ్ళిపోయారని వార్త రావడంతో అందరూ షాక్‌లో ఉండిపోయారు. దాదాపు 23రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన తారకరత్న ఫిబ్రవరి 18 (శనివారం) మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెలుగు సినిమా పరిశ్రమలోనీ ప్రముఖులందరూ నివాళులు అర్పించారు. అలాగే తేదేపా రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.