Nail Polish: ప్రస్తుత కాలంలో అమ్మాయిలు ట్రెండుకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారు ఏదైనా ఫంక్షన్ కి వెళ్లిన లేదా రోజు వారి కాలేజీలకు వెళ్లిన ఆఫీసులకు వెళ్లినా కూడా వారి డ్రెస్ కి అనుకూలంగా అన్ని మ్యాచింగ్ ఉండేలా జాగ్రత్తగా పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు అమ్మాయిలు నెయిల్ పాలిష్ కూడా ఎంతో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఒక్కో వేలికి ఒక్కో రంగు వివిధ రకాల డిజైన్స్ తో అమ్మాయిలు నెయిల్ పాలిష్ పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇలా ముందు రోజు పెట్టుకున్నటువంటి నెయిల్ పాలిష్ శుభ్రం చేసి మరుసటి రోజు మరొకటి పెట్టుకుంటున్నారు.
ఈ విధంగా ప్రతిరోజు నైల్ పాలిష్ మారుస్తూ ఉన్నవారు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా ప్రతిరోజు రంగులు మారుస్తూ ఉండటం వల్ల వివిధ రకాల చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధ్యయనాలలో తేలింది. అదే విధంగా అధిక శరీర బరువు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2000 పైగా నైల్ పాలిష్ ఉన్నాయని వీటిలో నాణ్యత ఉండటం కోసం ట్రైఫెనైల్ పాస్పెట్ అనే రసాయనం వాడుతున్నారు.
Nail Polish:
ఈ రసాయనం కారణంగా ఇది చర్మం పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది కనుక చర్మానికి తాకితే 10 గంటలలోనే దీని ప్రభావం మొదలై అధిక శరీర బరువు పెరగడానికి కారణం అవుతుంది. అదేవిధంగా హార్మోన్ల అసమతుల్యతకు కూడా ఈ రసాయనం ఎంతో కారణమవుతుంది. అందుకే నెయిల్ పాలిష్ ల విషయంలో అమ్మాయిలు జాగ్రత్త పడటం ఎంతో మంచిది.