Nail Biting: సాధారణంగా చాలామందికి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది వాళ్ళు ఏదైనా ఆలోచనలో ఉన్నప్పుడు లేదా కంగారుగా ఉన్నప్పుడు లేకపోతే ఏమి దిక్కుతోచని సమయంలో చేతి వేళ్లను తరచూ కొరుకుతూ ఉంటారు. ఇలా చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఈ అలవాటు చాలామందిలో ఉంటుంది.ఈ విధంగా తరచూ చేతి గోర్లను కొరుకుతూ ఉన్నారు అంటే మీరు ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. మరి గోర్లు కొరకడం వల్ల కలిగే ఇబ్బందులు ప్రమాదాలు ఏంటి అనే విషయానికి వస్తే….
అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం ఓ ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ గోళ్లు కొరకడం వలన పళ్ళు పాడవుతాయని చెప్తోంది. ఒకవేళ పంటికి కనక క్లిప్ ఉన్నప్పుడు ఇలా గోర్లను కొరకడం వల్ల పండు మొత్తం పాడైపోతుందని నిపుణులు వెల్లడించారు. తరచూ ఇలా గోర్లను కొరకడం వల్ల తీవ్రమైన తలనొప్పి రావడమే కాకుండా పళ్ళ సెన్సిటివిటీ కోల్పోవడం పళ్ళు ఊడిపోవడం జరుగుతుంది.అంతేకాకుండా తరచూ మనం చేతి వేళ్లను నోట్లో పెట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ జరిగే ప్రమాదం కూడా ఉంటుంది.
Nail Biting:
మనం ఎన్నో రకాల పనులను చేస్తూ ఉంటాము అయితే ప్రతిసారి చేతివేళ్లను నోట్లో పెట్టుకున్నప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కొని తద్వారా చేతి వేళ్లలో ఉన్నటువంటి బ్యాక్టీరియా నోటిలోకి వెళ్లి ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది.బ్యాక్టీరియా వలన గ్యాస్ట్రో ఇంటస్టినల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. పళ్ళని కొరకడం వలన గోళ్లు ఎర్రగా అయిపోవడం, వాపు కలగడం, చీము పట్టడం లాంటివి కూడా కలుగుతాయి. అందుకే ఎవరూ కూడా చేతివేళ్లను నోట్లో పెట్టుకొని గోళ్లను కొరక కూడదని డెంటల్ నిపుణులు చెబుతున్నారు.