Categories: EntertainmentLatest

Nagababu : వాడు పరాయివాడే నాగబాబు ట్వీట్ వైరల్

Nagababu : ఏపీ, తెలంగాణల్లో ఎన్నికలు ముగిసాయి. సోమవారం పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగింది. గతంతో పోల్చితే ఈసారి ఓటింగ్ శాతం కూడా ఆశాజనకంగానే ఉంది. మరికొద్ది రోజుల్లో రాజకీయ నాయకుల భవితవ్యం తేలనుంది. అయితే ఎన్నికలు ముగిసినా ఇంకా ఆ వేడి తగ్గలేదు. ఏపీ ఎన్నికలు మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య కొచ్చి చిక్కులను తెచ్చిపెట్టాయి. ఒకరకంగా రాజకీయ గోడలు కట్టేశాయి అని చెప్పుకోవచ్చు.పవన్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య మరోసారి వైరం భగ్గుమంది.

nagababu-sensational-tweet-on-allu-arjun

ఈ ఎన్నికల్లో మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. ప్రచారంలో భాగంగా మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కు సపోర్ట్ గా నిలిచింది. నాగబాబు,వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లు పిఠాపురం పోయి మరీ పవన్ ప్రచారంలో పల్గొన్నారు. ఇక అన్నయ్య చిరంజీవి ఓ వీడియో మెసేజ్ తో పవన్ కు మద్దతిచ్చారు. ఎలక్షన్ కి ముందు రోజు రామ్ చరణ్ పిఠాపురంలో ల్యాండ్ అయ్యి బాబాయ్ కి మద్దతుగా ప్రచారం చేశాడు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున మాత్రం ట్వీట్ ద్వారా పవన్ కల్యాణ్ కు మద్దతు తెలిపి సలైంట్ అయ్యాడు. కానీ బన్నీ ఫ్రెండ్ వైసీపీ క్యాండిటేట్ కోసం స్వయంగా నంద్యాల వెళ్లి మరీ అతడిని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చాడు. దీంతో బన్నీ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడనే ప్రచారం ఏపీలో జరిగింది. దీంతో జనసైనికులకు అల్లు అర్జున్ మీద ఓ రేంజ్ లో కోపం వచ్చింది.అంతే కాదు ఓటు వేసే సమయంలోనూ తన చర్యను బన్నీ సమర్థించుకున్నాడు.

nagababu-sensational-tweet-on-allu-arjun

ఇవన్నీ గమనించిన నాగబాబు డీప్ గా హర్ట్ అయ్యారు. అందుకే రాత్రి బన్నీకి ఇండైరెక్టుగా ఇచ్చిపడేశాడు. ట్విటర్ లో ట్వీట్ పెట్టి మరోసారి బన్నీ ఫ్యన్స్ ను రెచ్చగొట్టారు. ఈ ట్వీట్ తో పవన్, బన్నీ ఫ్యాన్స్ మధ్య మరోసారి వైరం మొదలైంది. తమది పవనిజం అంటూ పవన్ ఫ్యాన్స్, తమది అల్లు ఆర్మీ అంటూ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వార్ స్టార్ట్ చేశారు. ట్వీట్ లో నాగబాబు బన్నీ పేరెత్తకుండానే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. “మాతో ఉంటూ మా ప్రత్యర్థులను సపోర్ట్ చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!” అంటూ ఇన్ డైరక్ట్‌గా మెసేజ్ ఇచ్చారు నాగబాబు. నాగబాబు ట్వీట్ తో పవన్ కు కొతత్త తలనొప్పులు మొదలయ్యాయి.

nagababu-sensational-tweet-on-allu-arjun
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.