Categories: EntertainmentLatest

Manisha Koirala : ఆ సీన్ కోసం 12 గంటలకు పైగా బుర‌ద‌లో ఉన్న

Manisha Koirala : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెర‌కెక్కించిన ‘హీరామండి’ వెబ్ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సిరీస్ గా రికార్డ్ సృష్టించింది. విమర్శకుల ప్రశంసలను సైతం ఈ మూవీ అందుకుంది. ఈ సిరీస్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ రూపొందించినా సౌత్ లోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా బీలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలా ఈ సిరీస్ కు ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఇందులో వేశ్య మ‌ల్లికా జాన్ గా ఒక కీల‌క పాత్ర‌లో కనిపించిన మనీషా కొయిరాలా ఆ పాత్రకు నూటికి నూరు శాతం జీవం పోసింది. మనీషానే కాదు సౌత్ బ్యూటీ అదితిరావ్ హైదరీ, సోనాక్షి సిన్హాలతో పాటు బాలీవుడ్ నటుల తమ యాక్టింగ్ తో అందరిని బాగా ఆకట్టుకున్నారు.

manisha-koirala-spent-12-hours-in-muddy-water-for-heeramandi

అయితే తాజాగా మ‌నీషా ఓ ఇంట‌ర్వ్యూలో హీరామండిలో తన క్యారెక్టర్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది. ఓ సీన్ కోసం మనీషా ఏకంగా 12 గంటలకు పైగా బురద నీటిలో నానాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది. ఆ సీన్ పండాలనే ఉద్దేశంతో చివ‌రివరకు డైరెక్టర్ తనను వదలలేదని గుర్తు చేసుకున్నారు. అంతే కాదు హీరామండిలో తన క్యారెక్టర్ తన సినీ కెరీర్ లోనే ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఇలాంటి వైవిధ్యమైన పాత్రలో నటించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

manisha-koirala-spent-12-hours-in-muddy-water-for-heeramandi

” నాకు 50 ఏళ్లు.ఈమధ్యనే క్యాన్సర్ నుంచి బయటపడ్డాను. ఒకప్పుడు అంతా అయిపోయిందని అనుకున్నాను. నా లైఫ్ టర్న్ అవుతుందని అస్సలు ఊహించలేదు. ఇవాళ నాకు వస్తున్న ప్రశంసలను చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. నిజానికి హీరామండి షూటింగ్ ముందు నన్ను ఎన్నో సందేహాలు వేధించాయి. ఎన్నో ఆందోళ‌న‌లు ఎదుర్కొన్నాను. నా శరీరం ఈ భారీ దుస్తులను, ఆభరణాలను ,షూటింగ్ షెడ్యూల్‌లను తట్టుకుంటుందో లేదో తెలియదు. ఇక హీరామండిలో ఓ సీన్ మాత్రం నాకు పెద్ద సవాల్ గా నిలిచింది. నీళ్ల‌లో 12 గం.లు పైగా నానే సీన్ అది. ఆ ఫౌంటెన్ సీక్వెన్స్ నాకు, నా శారీరానికి పెద్ద సవాల్ గా మారింది. నన్ను 12 గంటలకు పైగా ఫౌంటెన్‌లో నిమజ్జనం చేసారు. నీరు వెచ్చగా, క్లీన్ గా ఉందని డైరెక్టర్ చెప్పినా గంటలు గడిచేకొద్దీ ఆ నీరే బురదగా మారింది. నా శరీరంలోని ప్రతి రంధ్రం ఆ బురదలో తడిసిపోయింది. షూటింగ్ పూర్తైన తర్వాత నా శరీరం అలసిపోయినా, నా హృదయంలో ఘాడ‌మైన‌ ఆనందాన్ని అనుభవించాను. కాస్త స్ట్రెస్ ఫీల్ అయినా నా శరీరం చాలా దృఢంగా ఉంది” అని మ‌నీషా తెలిపారు.

Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 week ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 week ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 week ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

This website uses cookies.