Naga panchami: హిందూ సంప్రదాయం ప్రకారం హిందువులు ఎన్నో రకాల పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే శ్రావణమాసం రావడంతో శ్రావణమాస అమావాస్య తర్వాత వచ్చే పంచమి రోజున నాగపంచమిని జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది నాగపంచమి ఆగస్టు 21వ తేదీ సోమవారం వచ్చింది. దీంతో ఈ రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయానికి వస్తే…నాగ పంచమి రోజు చాలా మంది భక్తులు ఉపవాసం ఉంటూ నాగదేవత విగ్రహాలకు లేదా పుట్టకు పాలు పోయడం ఆనవాయితీగా చేస్తూ ఉంటారు.
ఇలా నాగపంచమి రోజు పుట్టకు పాలు పోసేవారు కొన్ని పద్ధతులను పాటించవలసిన అవసరం ఎంతో ఉంది.ఇలా నాగపంచమి రోజు పుట్టకు పాలు పోసేవారు పుట్టలోకి పాలు పోస్తే మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో విపరీతంగా పాలు పోస్తుంటారు అలా కాకుండా ఆచారం ప్రకారం కొద్దిగా పాలు పోయడం ఎంతో ముఖ్యం. నాగ పంచమి రోజున పరిసర ప్రాంతాలలో పాములు కనబడితే వాటిని దైవ స్వరూపాలుగా భావించి వాటికి పాలు పోయడం లేదా వాటికి పూజలు చేయడం వంటివి చేయరాదు. అదేవిధంగా ఆరోజు పాములను కూడా చంపకూడదు.
Naga panchami:
భక్తిశ్రద్ధలతో పుట్టకు లేదా నాగ దేవత విగ్రహాలను సందర్శించి పాలు పోసే సాంప్రదాయం ప్రకారం పండ్లు చలివిడిని నైవేద్యంగా సమర్పించాలి. ఇక ఉపవాసం ఉన్నటువంటి వారు ఆహారం కాకుండా ఇతర పదార్థాలను తీసుకుంటూ ఉంటారు అలా చేయకూడదు. పండ్లు పాలు మాత్రమే ఫలహారంగా తీసుకొని ఉపవాసం చేయాలి.అయితే కొందరు పాలు పోసే వరకు ఉపవాసం ఉండి అనంతరం చలివిడితో వారి ఉపవాసం ముగుస్తారు. అయితే మరి కొందరు రోజు మొత్తం ఉపవాసం ఉంటారు. ఇలా ఉపవాసం ఉన్నవారు పండ్లు పాలు మాత్రమే తీసుకోవాలి.