Naga Chaitanya: ‘నాకంటే సమంత గ్రేట్’.. అంటూ అక్కినేని నాగ చైతన్య మాజీ భార్య సమంత గురించి పాజిటివ్‌గా మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు. సమంత, నాగ చైతన్య విడిపోయిన దగ్గర్నుంచీ ఇప్పటి వరకూ ఈ విధమైన కామెంట్స్ చైతూ సమంత గురించి చేయలేదు. సమంత మొదటి సినిమా ఏ మాయ చేశావే నుంచి ఇద్దరు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో అందరికీ తెలిసిందే.
ఆ తర్వాత వివాహం, విడాకుల గురించి ప్రతీ ఒక్కరికీ చాలా క్లియర్‌గా తెలుసు. విడిపోయిన తర్వాత కొంతకాలం సమంత తన ఇన్స్టాగ్రాం లో పోస్ట్లు పెడుతూ వచ్చింది. ఆ పోస్టులు చూస్తే ఖచ్చితంగా నాగ చైతన్యని ఉద్దేశించే అనిపించింది. అవి సోషల్ మీడియాలోనూ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే, గత మూడు నాలుగు నెలల నుంచి మళ్ళీ వీరిద్దరు కలవబోతున్నారనే మాట అంతటా వినిపిస్తోంది.
ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహానికి సమంత, నాగ చైతన్య హాజరయ్యారు. ఇద్దరు వేరే వేరే ఫ్లైట్స్‌లో వెళ్ళినా, అక్కడ మాత్రం ఎదురుపడటం అందరికీ కాస్త ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఒకరినొకరు చూసుకొని సైలెంట్‌గా వెళ్ళిపోయారు. అయితే, నాగ చైతన్య ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎవరూ ఊహిచని రీతిలో పాజిటివ్ కామెంట్స్ చేశాడు.
నాకంటే అన్నీ ఉన్నాయి..పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను. హీరో అవడానికి ఏమీ కష్టపడలేదు. కానీ, సమంత అలా కాదు, మొదట్నుంచీ ఎన్నో కష్టాలు అనుభవించింది. ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా భరించింది. తనలా ఎవరూ ఉండరు. చాలా పట్టుదల..అనుకున్నది సాధిస్తుంది. విడాకులు అయినంత మాత్రాన ఎందుకు ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలి..అంటూ సమంత మీద తనకున్న అభిప్రాయాన్ని బాగా చెప్పారు. ఈ వీడియో చూశాక అటు సమంత అభిమానులు ఇటు నాగ చైతన్య అభిమానులు చైతూని పొగడ్తలతో ముంచేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.