NBK 109: RS.10 కోట్లా RS.5 కోట్లా..ముల్లు దిగేది ఎటువైపు..?

NBK 109: 10 కోట్లా 5 కోట్లా..ముల్లు దిగేది ఎటువైపు..? అంటూ తాజాగా సెట్స్ పైకి వచ్చిన ఎన్‌బీకే 109 గురించి ఆయన అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. వరుస విజయాలతో మాంచి ఊపు మీదున్న నందమూరి బాలకృష్ణ ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. సినిమా మొత్తం ఆయన భుజాలపై మోసి ప్రశంసలు అందుకున్నారు.

భగవంత్ కేసరి లాంటి సినిమా ఒప్పుకోవాలంటే అది బాలయ్యకే సాధ్యమని చెప్పుకున్నారు. రెగ్యులర్ సినిమాల మాదిరిగా కాకుండా ఆయన వయసుకి తగ్గట్టు కథలు ఎంచుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు, సినీ లవర్స్ గొప్పగా చెప్పుకున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలయ్య తన 109వ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టారు. మంచి ఫాంలో ఉన్న బాబి ఈ సినిమాకి దర్శకుడు.

nbk-109- RS.10 crore or RS.5 crore..which side will the thorn fall on..?

NBK 109: ‘బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్’..

బాబీ గత చిత్రం వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. మాస్ మల్టీస్టారర్‌గా వచ్చిన ఈ సినిమా మెగాస్టార్, రవితేజలకి సాలీడ్ హిట్ ఇచ్చింది. అదే జోష్‌లో బాబి,,బాలయ్యతో తన నెక్స్ట్ సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చారు. షూటింగ్ మొదలుపెట్టిన సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా ఫస్ట్ పోస్టర్‌ను వదిలారు. గొడ్డలి, దానికి గాగూల్ పెట్టి “బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్.. వయోలెన్స్ కా విజిటింగ్ కార్డ్”..అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

దీనిని బట్టి సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది తేలలేదు. అనిరుధ్ రవిచందర్ ని సంప్రదించగా 10 కోట్లు అడిగినట్టు తెలుస్తుంది. కానీ, ఈ రెమ్యునరేషన్ దర్శకుడు బాబీ కంటే ఎక్కువ. ఇక రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ అయితే 5 కోట్లు అందుకుంటున్నారు. ఇది మేకర్స్ కి ఎఫర్టబుల్. బాలయ్య, దేవీ, బాబీ-దేవీ కాంబోలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. కాబట్టి దేవీకే ఫిక్స్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ రెండూ ఆప్షన్స్ కాకపోతే ఇప్పటికే బాలయ్యతో ట్యూన్ అయిన థమన్ కి ఛాన్స్ ఇవ్వొచ్చు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 week ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 week ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 week ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

This website uses cookies.