Naga Panchami: ప్రతి ఏడాది మనం ఎన్నో పండుగలను జరుపుకుంటూ ఉంటాము మన హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసం ఎంతో పవిత్రమైనదిగా భావించి ఆ మాసంలో ఎన్నో రకాల పండుగలు వ్రతాలను జరుపుకుంటూ ఉంటాము. ఇక శ్రావణ మాసంలో జరుపుకునే పండుగలలో నాగ పంచమి కూడా ఒకటి. ఈ నాగపంచమి రోజున ప్రత్యేకంగా కొన్ని పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ ఏడాది నాగపంచమి ఎప్పుడు సరైన ముహూర్తం తిథి ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం…
ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున నాగ పంచమి పండుగను జరుపుకుంటారు. నాగ పంచమి రోజును నాగేంద్రుడికి అంకితమైన రోజు. కనుక ఈ రోజున ప్రజలు సర్పానికి పాలు సమర్పించి పూజిస్తారు. ఇక ఈ ఏడాది నాగ పంచమి ఆగస్టు9 2024 శుక్రవారం జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి ఆగష్టు 9 న ఉదయం 12:36 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది ఆగస్టు 10న తెల్లవారుజామున 3:14 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం నాగ పంచమి పండుగ ఆగస్టు 9 న జరుపుకుంటారు.
నాగ పంచమి పూజ ముహూర్తం ఆగస్టు 9 ఉదయం 05:47 నుంచి 08:27 వరకు. ఈ సమయంలో శివ భక్తులు నాగదేవతను పూజిస్తారు. ఈ రోజున నాగ దేవతకు ప్రత్యేకమైన పూజలు చేయడమే కాకుండా పుట్టకు వెళ్లి పుట్టకు కూడా పూజ చేసే అనంతరం పుట్టలో పాలు వేసి నాగదేవతను పూజిస్తారు ఇలా చేయడం వల్ల జాతకంలో సర్ప దోషాలు నాగ దోషాలు ఉన్నా కూడా విముక్తి కలుగుతుందని భావిస్తారు. ఇక నాగదోషం ఉన్నవారు పుట్టలో నాగ పడగలను వేయటం వల్ల కూడా ఆ దోషం తొలగిపోతుంది.