Mogali Flower: ఎంతో సువాసనను వెదజల్లే పుష్పాలలో మొగలి పువ్వు ఒకటి మొగలి పువ్వు అంటే ఆ చుట్టూ ప్రదేశంలో ఎంతో సువాసనలను కలిగి ఉంటుంది ఇలా ఎంతో సువాసన భరితమైనటువంటి మొగలి పువ్వును దేవుడి పూజకు అసలు ఉపయోగించరు. ఇలా మొగిలిపువ్వు ఉపయోగించకపోవడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే పరమేశ్వరుడి శాపం కారణంగా మొగిలిపువ్వు పూజకు అనర్హంగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువులకు ఈశ్వరుడు ఒక పరీక్ష పెట్టారట.
శివుడు లింగరూపం దాల్చి తన తల పాదాలు ఎక్కడ ఉన్నాయో వెతికి తీసుకురమ్మని బ్రహ్మ విష్ణువుకి చెబుతాడు అయితే వీరు ముల్లోకాలు గాలించిన శివుడి తల పాదాలు ఎక్కడున్నాయో తెలియవు దీంతో బ్రహ్మ విష్ణువు తిరిగి శివుడి వద్దకు వచ్చి అసలు విషయం చెబుతారు. విష్ణువు ముల్లోకాలు గాలించిన మీ శిరస్సు పాదాలు ఎక్కడున్నాయో తెలియడం లేదు అని నిజం ఒప్పుకోగా బ్రహ్మ మాత్రం తన కుటీల బుద్ధితో తనతో పాటు ఒక మొగిలి పువ్వును ఒక కామధేనువును తీసుకువస్తారు.
పరమేశ్వరుడి తల తాను చూసినట్లు మొగలి పువ్వు చేత అబద్ధపు సాక్ష్యం చెప్పిస్తాడు బ్రహ్మ చెప్పిన విధంగానే మొగిలిపువ్వు తల చూసానని ఆపద్ధపు సాక్ష్యం చెప్పగా కామదేనువు మాత్రం లేదు అంటూ తన తోకతో నిజం చెబుతుంది దీంతో పరమేశ్వరుడుకి కోపం వచ్చింది అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు నీవు ఏ దేవతా పూజలకు పనికిరాని పూజకు అనర్హమని చెబుతాడు. అలాగే కామధేనువు తోకతో సత్యం చెప్పినందుకు తన తోక పూజకు అర్హం అంటూ వరం ఇస్తాడు. అందుకే కామదేను ఓకే ఎప్పుడు కూడా వెనుక వైపు పూజ చేయడం వల్ల శుభం కలుగుతుందని పండితులు చెబుతుంటారు.