MSG: ఈ సారి సంక్రాంతి పండుగ సందడంతా మన శంకరవరప్రసాద్ గారు సినిమాదే. ఫైనల్ రన్‌లో ఈ సినిమా ఎన్ని కోట్ల ప్రాఫిట్ సాధిస్తుందో తెలియదు గానీ, ట్రేడ్ వర్గాల ద్వారా అందుతున్న సమచారం మేరకు ఇప్పటికే, లాభాల్లోకి చేరుకుందట. ఆల్రెడీ యూఎస్‌లో ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి అనుకున్న మార్క్‌ను రీచైంది. నయనతార హీరోయిన్‌గా, వెంకటేష్ కీ రోల్ లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు 2026 సంక్రాంతికి భారీ హిట్ అని చెప్పుకుంటున్నారు.
దర్శకుడు అనిల్ రావిపూడి గత సంక్రాంతికి వెంకటేష్‌తో సంక్రాంతికి వస్తున్నాం మూవీతో వచ్చి హిట్ సాధించాడు. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో మన శంకరవప్రసాద్ గారు సినిమాతో వచ్చి సాలీడ్ హిట్ అందుకున్నారు. ప్రభాస్-మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ది రాజాసాబ్ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా 5 భాషల్లో రిలీజై తెలుగులో యావరేజ్ టాక్‌తో మిగతా భాషల్లో డిజాస్టర్‌గా మిగిలింది.
ఒకరకంగా చెప్పాలంటే చిరు-అనిల్ సినిమాకి ఇదే బాగా కలిసి వచ్చింది. రాజాసాబ్ గనక భారీ హిట్ టాక్‌తో థియేటర్స్‌లో సందడి చేసి ఉంటే అంతగా మన శంకరవప్రసాద్ గారు సినిమాకి థియేటర్స్ దొరికేవి కాదు, ఆశించిన వసూళ్ళు దక్కేవి కాదు. ఇది ఒప్పుకొని తీరాల్సిందే. కానీ, ప్యూర్‌గా ఫ్లాప్ టాక్ వచ్చింది. దీంతో, చిరు-అనిల్ సినిమాకే ఆడియన్స్ టర్న్ తీసుకున్నారు.

MSG: 4 లక్షల బుకింగ్స్‌తో మన శంకరవరప్రసాద్ గారు సత్తా చాటుతోంది.
రవితేజ-కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి యావరేజ్ టాక్ కొన్నిచోట్ల వస్తే..బాగోలేదన్న టాక్ ఇంకొన్ని చోట్ల వచ్చింది. ఓవరాల్‌గా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. ఇక, మిడ్ రేంజ్ హీరోలు శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒకరాజు సినిమాలకి పాజిటివ్‌గా రివ్యూస్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా, మిగతా సినిమాలలో 2 సినిమాలు సర్దుకోగా మెగాస్టార్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అంతేకాదు, రోజుకి 4 లక్షల బుకింగ్స్‌తో మన శంకరవరప్రసాద్ గారు సత్తా చాటుతోంది.

