Monsoon Season: వర్షాకాలం మొదలవడంతో వాతావరణంలోని ఉష్ణోగ్రతలలో కూడా మార్పు వచ్చింది. రుతుపవనాల రాకతో తొలకరి జల్లులు పడటం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోయాయి.అయితే వాతావరణం చల్లబడటంతో ఇన్ని రోజులపాటు ఏసీలను చాలా ఎక్కువగా ఉపయోగించి ఉంటారు. ప్రస్తుతం ఒక్కసారిగా ఏసీల పనితీరు కూడా తగ్గిపోతూ ఉంటుంది ఆయనప్పటికీ ఏసీల విషయంలో చాలా జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే వర్షాకాలంలో కూడా ఏసీలు పాడవకుండా మరింత బాగా పని చేయాలి అంటే తప్పకుండా ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఈ సీజన్లో వర్షాలు ఎక్కువగా పడటం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోతున్నాయి. మీ గదిలో ఉక్కపోత, తేమ లేకుండా రూమ్ టెంపరేచర్ ఉంటేట్లు చూసుకుంటే సరిపోతుంది. మీ ఏసీలను కనీసం 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచుకుంటే సరిపోతుంది.
Monsoon Season
వర్షాకాలంలో గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. మీ ఏసీలో ఆప్షన్ ఉంటే డ్రై మోడ్లో ఉంచుకోవాలి. అది తేమను అదుపు చేస్తుంది.సీజన్ ఏదైనా సరే ఏసీలు సక్రమంగా పని చేయాలి అంటే ఎయిర్ ఫిల్టర్లు కూడా చాలా శుభ్రంగా ఉండాలి. కనీసం రెండు నెలలకు ఒకసారి అయినా చెక్ చేసుకోవాలి. దీని వల్ల మీ ఏసీ పనితీరు మెరుగు అవుతుంది. ఏసి పనితీరు మెరుగవ్వాలి అంటే గదిలో వేడిని ఉత్పత్తి చేసే వస్తువులను అసలు పెట్టకూడదు. అలాగే తరచూ ఏసి సర్వీసింగ్ కూడా చేస్తూ ఉండటం వల్ల ఎక్కువ కాలం ఏసీ మంచి పని తీరుతో నడుస్తుంది.