Vastu Tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఎన్నో ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటాము. ముఖ్యంగా అమ్మాయిలు పెళ్లి తర్వాత నుదుటిన బొట్టు చేతికి గాజులు జడలు పువ్వులు ఇలాంటివన్నీ తప్పనిసరిగా వేసుకోవాలని చెబుతుంటారు అలాగే అబ్బాయిల విషయంలో కూడా కొన్ని పద్ధతులను పాటించాల్సిందేనని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా అబ్బాయిలు చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు కూడా మొలతాడు కట్టుకోవడం ఆచారంగా వస్తుంది.
ఇలా మగవారు మొలతాడు కట్టుకోవడానికి గల కారణం ఏంటి అసలు ఎందుకు కట్టుకుంటారు అనే విషయానికి వస్తే.. పూర్వకాలంలో బెల్టులు అలాంటివి లేకపోవడంతో ప్యాంటులు లేదా పంచలు జారిపోకుండా ఉండడం కోసం బెల్టులు కట్టుకోవడం ఒక కారణం అయితే ఎక్కువగా అడవులలో తిరగాల్సి రావడంతో ఎలాంటి పురుగు కరిచిన ఆ విషం శరీరం పాకకుండా ఉండడం కోసం ఈ మొలతాడు అవసరమవుతుందన్న ఉద్దేశంతో కట్టుకునే వారని పెద్దలు చెబుతూ ఉంటారు.
జ్యోతిష శాస్త్రం ప్రకారం మొలతాడు మగవారు కట్టుకోవడం వెనుక మరో కారణం ఉందని చెబుతుంది. మొలతాడు లేకుండా ఉండటం అంటే చనిపోవడమనే అర్థం వస్తుంది. పెద్దల ప్రకారం.. చనిపోయినప్పుడు మాత్రమే మొలతాడును తీసేస్తారు. అందుకే మొలతాడును ఎప్పుడూ నడుముకు ఉండేలా చూస్తారు. ఇక చాలామంది ఎరుపు రంగు లేద నలుపు రంగు మొలతాడు కట్టుకొని ఉంటారు. ఈ మొలతాడు దిష్టి తగలకుండా ఉండడానికి కూడా మగవారికి ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారు.