Mirnaa Menon: మలయాళీ ముద్దుగుమ్మలు ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఎక్కువ సక్సెస్ అవుతున్నారు. ఒకప్పటి వెటరన్ హీరోయిన్స్ అయిన లక్ష్మి, కెఆర్ విజయ లాంటి వారితో మొదలు పెడితే తరువాత మీనా, ఇంద్రజ లాంటి తారలు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ అయ్యారు.
ఆ తరువాత మీరాజాస్మిన్ లాంటి హీరోయిన్స్ స్టార్ హీరోయిన్స్ అయ్యారు. ప్రస్తుతం కీర్తి సురేష్, నివేతా థామస్, నిత్యా మీనన్, అనుపమ పరమేశ్వరన్, సంయుక్తా మీనన్ లాంటి అందాల భామలు టాలీవుడ్ లో హీరోయిన్స్ గా సక్సెస్ ట్రాక్ ని మెయింటేన్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ దారిలోకి మాళవిక మోహనన్, మాళవిక నాయర్, మాళవిక మీనన్ లాంటి అందాల భామలు టాలీవుడ్ లోకి అడుగుపెట్టి సక్సెస్ కోసం చూస్తున్నారు. ఇక మలయాళీ ముద్దుగుమ్మలకి ఎక్కువగా నటిగా తమకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు.
ఇప్పుడు వీరి దారిలో మరో ముద్దుగుమ్మ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా తన అదృష్టం పరీక్షించుకోవడానికి రెడీ అవుతుంది. అందాల భామ మీర్నా మీనన్ క్రేజీ ఫెలో అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
అయితే ప్రస్తుతం అల్లరి నరేష్ ఉగ్రం సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాపై ప్రస్తుతం అమ్మడు హోప్స్ పెట్టుకుంది. అయితే ఈ అమ్మడు టాలీవుడ్ లోకి అడుగుపెట్టడంతోనే గ్లామర్ షోకి కూడా తాను సిద్ధం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా హాట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. నడుము అందాలు చూపిస్తూ మీర్నా మీనన్ షేర్ చేసిన ఈ ఫోటోలకి తెలుగు సినీ అభిమానులు భాగానే లైక్ చేస్తున్నారు.