Milk: ప్రస్తుత కాలంలో స్వచ్ఛత అనే పేరు కనుమరుగైపోయింది. మనం ఏ ఆహార పదార్థాలు కొన్న వీటిని కొనుగోలు చేసిన అందులో భారీ ఎత్తున కల్తీ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. పిల్లల తాగే పాల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కటి కల్తీ అవుతున్నాయి. అయితే మనం ప్రతిరోజు ఆరోగ్యం కోసం ఉపయోగించే పాలలో ఎక్కువ శాతం కల్తీలు జరుగుతున్న సంఘటనలు మనం చూస్తున్నాము.. అయితే ప్రతిరోజు మనం తాగే పాలు స్వచ్ఛమైనవా లేక కల్తీనా అనే సందేహాలు తరచూ వస్తుంటాయి. అయితే పాలు స్వచ్ఛమైన లేదా అనే విషయాలు చిన్న టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అది ఎలానో ఇక్కడ తెలుసుకుందాం…
మనం ప్రతిరోజు తాగే పాలలో ఏదైనా కల్తీ జరిగిందా లేదా స్వచ్ఛమైన పాలేనా అనే విషయం తెలుసుకోవాలంటే ఒక సాదా గాజు వంటి పాలిష్ చేసిన, ఏటవాలు ఉపరితలంపై రెండు మూడు చుక్కల పాలు వేయండి స్వచ్ఛమైన పాలు అయితే నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. అలాగేవెనుక వైపు మనం ఒక తెల్లటి జాడను చూడవచ్చు అదే కల్తీ పాలు అయితే చాలా తొందరగా ముందుకు కదులుతాయి. అలాగే వెనుక ఎలాంటి జాడ కూడా కనిపించదు ఇలా ఉంటే ఆ పాలు స్వచ్ఛమైనవి కాదు అని అర్థం.
Milk:
5-10 మిల్లీలీటర్ల పాలను, సమాన పరిమాణంలో నీటిని తీసుకోండి. వీటిని బాగా షేర్ చేయాలి ఇలా షేక్ చేసిన తర్వాత పాలలో నురుగు కనక ఏర్పడితే ఆ పాలలో డిటర్జెంట్ కలిపి కల్తీ చేశారని అర్థం. స్వచ్ఛమైన పాలు నురగకు ఎప్పుడు పలుచని పోర ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. 2-3 మిల్లీలీటర్ల పాలను 5 మిల్లీలీటర్ల పాలను నీటితో మరిగించండి. ఈ పాలు చల్లారిన తర్వాత అందులోకి రెండు చుక్కల అయోడిన్ టించర్ కలపాలి. ఈ టించర్ కలిపిన వెంటనే పాలు నీలిరంగులోకి మారితే ఆ పాలలో పిండి లేదా ఏదైనా పౌడర్ కలిపారని అర్థం ఇలా ఈ చిన్న పరీక్షల ద్వారా మనం తాగే పాలు స్వచ్ఛమైనవా లేదా కల్తీవా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.