Tue. Jan 20th, 2026

    Pain Killer: మహిళలు ప్రతినెల ఎదుర్కొనే సమస్యలలో పీరియడ్స్ సమస్య ఒకటి. ఇలా ప్రతినెల నెలసరి సమయంలో చాలామంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. చాలా మంది నడుము నొప్పి సమస్యతో పాటు కడుపునొప్పి సమస్యను కూడా భరిస్తూ ఉంటారు. అలాగే మరి కొంతమందిలో వికారం వాంతులు కావడం తల తిరగడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.

    ఈ విధంగా పీరియడ్స్ సమయంలో అధిక నొప్పి సమస్యతో బాధపడేవారు ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడం కోసం ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల అప్పటికి చాలా ప్రశాంతంగా అనిపించిన ఇలా మందులు వాడటం వల్ల భవిష్యత్తులో మరిన్ని సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి నెలసరి సమయంలో ఇలాంటి పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయనే విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి.

    పీరియడ్స్ సమయంలో చాలామంది మహిళలు వైద్యుని ప్రిస్క్పిప్షన్ లేకుండానే ఇబూప్రోఫెన్, ఎసిటమినోఫెన్, నాప్రాక్సిన్ వంటి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడుతుంటారు. ఇలా వాడటం మంచిదా కాదా అనేదే ఇప్పుడు సందేహం కానీ తీవ్రమైన నొప్పి ఉండి డాక్టర్ సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి లేకపోతే భవిష్యత్తులో ఇది సమస్యగా మారుతుంది. కొన్నిసార్లు గర్భాశయంలో గడ్డలు ఏర్పడటం వంటివి కూడా జరుగుతాయి. తద్వారా సర్జరీ వరకు పరిస్థితులు దారి తీసే అవకాశాలు ఉన్నాయి కనుక డాక్టర్ సలహా మేరకు మందులు వాడటం మంచిది.