Tue. Jan 20th, 2026

    Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా సెకండ్ ఇన్నింగ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఐదు సినిమాలు పూర్తి చేశారు. ఐదింటిలో నాలుగు సూపర్ హిట్స్ తో తన ప్రహసనం కొనసాగిస్తోన్నారు. హీరోగా తనకి తిరుగులేదని నిరూపించుకుంటున్నారు. ఈ ఏడాది వాల్తేర్ వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ మూవీలో నటిస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఆగష్టు 11న రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత మెగాస్టార్ చేయబోయే సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అయితే మెగాస్టార్ కొత్త కథలతో, ఓ వైపు ఈ జెనరేషన్ దర్శకులపై దృష్టి పెడుతూనే మరో వైపు ఇతర భాషా సినిమాలపై కూడా ఆసక్తి చూపిస్తూ ఉండటం విశేషం.

    Waltair Veerayya: Pre-Release Event Of Chiranjeevi Starrer To Be Held Today  In Vizag

    ఈ జెనరేషన్ దర్శకులు మెగాస్టార్ ఇమేజ్ కి రీచ్ అయ్యే కమర్షియల్ యాంగిల్ కథలు చెప్పడం లేదనేది ఆయన ఫీలింగ్. వెంకి కుడుముల ఒక కథని మెగాస్టార్ కి వినిపించారు. అయితే వాటిలో మార్పులని ఆయన సూచించారు. అయితే వాటిని చేయలేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు. కొరటాల శివ అయితే డిజాస్టర్ ఇచ్చారు. ఈ జెనరేషన్ దర్శకులు అందరూ కూడా కథని నమ్ముకొని హీరో ఇమేజ్ ని బిల్డ్ చేస్తోన్నారు. అయితే మెగాస్టార్ మాత్రం కమర్షియల్ కోణంలోనే తన ఎలివేషన్ ఉండాలని కోరుకుంటున్నారు.

    Bheeshma Parvam' Twitter review: Netizens all praise for Mammootty- Amal  Neerad's action drama | Malayalam Movie News - Times of India

    వాల్తేర్ వీరయ్య టైపులో కథలని కోరుకుంటున్నారు. రొటీన్ ఉన్న బిల్డప్ ఎక్కడా తగ్గకూడదని అనుకుంటున్నారు. అందుకే ఇతర భాషలలో హిట్ అయిన కమర్షియల్ చిత్రాలపై దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు వివి వినాయక్ దర్శకత్వంలో తమిళ్ లో అజిత్ హీరోగా నటించిన విశ్వాసం సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ మూవీ తెలుగులో కూడా డబ్ అయ్యింది. అలాగే మమ్ముట్టి భీష్మపర్వం అనే మాఫియా అండ్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ మూవీని కూడా రీమేక్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఈ రెండింటిలో ఒకటి నెక్స్ట్ సెట్స్ పైకి తీసుకెళ్ళే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.