Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ మెగాస్టార్ ఏ పనులను మెగా 158 కోసం దుబాయ్‌లో మొదలు పెట్టారు..ఈ సినిమా కోసం పనిచేస్తున్న స్టార్ రైటర్ ఎవరూ..సంగీతం అందించబోతున్న ఆ ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరూ..ఇలాంటి డీటైల్స్ అన్నీ వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం..
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మన శంకరవరప్రసాద్‌గారు మ్యానియా కొనసాగుతోంది. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌కి దగ్గర్లో ఉంది. అనిల్ రావిపూడి స్క్రిప్ట్, మెగాస్టార్ కామెడీతో పాటు వింటేజ్ లుక్స్, నయనతార పర్ఫార్మెన్స్, వెంకీ స్పెషల్ అపీరియన్స్..ఇలా అన్ని సినిమా భారీ సక్సెస్‌కి కారణమయ్యాయి. ఓకరకంగా చెప్పాలంటే బాస్ రీ ఎంట్రీ తర్వాత ఇంత భారీ హిట్ అందుకున్న సినిమా ఇదే. వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత మళ్ళీ ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాతో సాలీడ్ హిట్ కొట్టాడు బాస్.

Mega 158: బాబీ దర్శకత్వంలో చిరు తన 158వ సినిమాను చేస్తున్నారు.
మెగా ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్ అందరూ మన శంకరవరప్రసాద్ గారు సినిమా హ్యాంగోవర్‌లోనే ఉన్నారు. కానీ, మెగాస్టార్ మాత్రం తన నెక్స్ట్ సినిమా మెగా 158 పనుల్లో బిజీ అయిపోయారు. వాల్తేరు వీరయ్య మూవీతో సూపర్ హిట్ ఇచ్చిన బాబీ దర్శకత్వంలో చిరు తన 158వ సినిమాను చేస్తున్నారు. త్వరలో ఈ మూవీ సెట్స్‌పైకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చిత్ర యూనిట్ అంతా దుబాయ్‌లో స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకరచయిత కోన వెంకట్ ఈ సినిమా స్క్రిప్ట్ పర్యవేక్షిస్తున్నాడు.
ఇక, తమిళంలో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన కేవిఎన్ ప్రొడక్షన్స్ మొదటిసారి టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తూ మెగాస్టార్‌తో మెగా 158 చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో చిరు మాఫియా డాన్ పాత్రలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, పెద్ది చిత్రానికి సంగీతం అందిస్తున్న ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నట్టుగా తెలుస్తోంది. జూన్ లేదా జూలై నుంచి షూటింగ్ మొదలుపెట్టబోతున్నారట. టీమ్ తో పాటు చిరు కూడా ఈ సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారట. మొత్తానికి, ఒక సినిమాను పూర్తి చేసి వెంటనే మరో సినిమా కోసం సమయం కేటాయించడం బాస్ గొప్పతనమని చెప్పుకుంటున్నారు.

