Mask: కరోనా మహమ్మారి అందరినీ ఓ రేంజ్‌లో భయబ్రాంతులకు గురిచేసింది. ఊపిరి పీల్చుకోవాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితిని తీసుకువచ్చింది. 2019లో చెలరేగిన ఈ మహమ్మారి ప్రపంచంలోని జనాభానంతటిని కుదిపేసింది. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అందురూ ఈ వైరస్ బారిన పడి అష్టకష్టాలు పడ్డారు. కొందరు తనువు చాలిస్తే మరికొంత మంది అదృష్టవశాత్తు బ్రతికి బట్టకట్టారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గిందని భావిస్తున్నప్పటికీ ఇప్పటికీ అందరికీ పూర్తిస్థాయిలో నమ్మకం కుదరడం లేదు ముందు ముందు ఏ రూపంలో వైరస్‌లు అటాక్ చేస్తాయోనన్న ఆందోళన నడుమే కాలాన్ని వెల్లదీస్తున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
నిజానికి ఇంతటి విపత్కర కాలంలో కూడా మనం సురక్షితంగా ఉంటూ ఆరోగ్య కరమైన జీవితాన్ని అనుభవిస్తున్నామంటు అది కేవలం మాస్క్ వల్లే అని చెప్పక తప్పదు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవం. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటి వరకు మాస్క్ ధరించడం వల్ల మన ఆరోగ్యాలు ఎంతో సురక్షితంగా ఉన్నాయి. ఒకప్పుడు ఆపరేషన్ థియేటర్లలో నర్సులు, డాక్టర్లు మాత్రమే మాస్కు లను వాడేవారు. కానీ పరిస్థితులు మారాయి. వైరస్‌లు విజృంభిస్తున్నాయి. ఈ తరుణంలో ఇంట్లో ఉన్నా బయటికి వెళ్లాలన్నా సేఫ్‌గా ఉండాలంటే మాస్క్ కంపల్సరీ అని ప్రజలందరూ భావిస్తున్నారు.
మొదట్లో కరోనా ఉందని అందరూ తప్పక మాస్కులు ధరించాలని ప్రభుత్వాలు చెప్పినా పెడచెవిన పెట్టినవారే ఇప్పుడు మాస్కులు లేకుండా ఇంటి గుమ్మాన్ని కూడా దాటడం లేదు. మాస్క్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమై పోయింది. అందుకు కారణాలు లేకపోలేదు. ముందు అందరూ కరోనా బారిన పడకూడదని, వైరస్ విజృంభణను అడ్డుకోవాలన్న ఉద్దేశ్యంతో మాస్కులను వాడినా అవి చేసే మేలు తెలిసిన తరువాత వాటిని ఎప్పుడూ ధరించేందకు సుముఖంగానే ఉంటున్నారు హెల్త్ కేర్ తీసుకునేవారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి లేదు. భారత్ లో చాలా ప్రాంతాలలో మాస్క్ కంపల్సరీ లేకుండానే జనాలు తిరిగేస్తున్నారు. కానీ మాస్కులు ధరించడం వల్ల కేవలం కరోనాకే కాదు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
నగరాల్లో నివసించేవారికి మాస్క్‌లు రక్షణ కవచాలుగా ఉపయోగపడుతున్నాయి. సిటీల్లో ముఖ్యంగా మెట్రో సిటీల్లో ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువ. ఈ పొల్యూషన్ కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో సతమతమవుతు న్నాయి. ఈ క్రమంలో ప్రతి రోజు ఆఫీసులకు వెళ్లేవారు మాస్కులను ధరించడం వల్ల పొల్యూషన్ నుంచి ప్రొటెక్షన్ లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్ ధరించడం వల్ల లంగ్స్ ఇన్‌ఫెక్షన్‌లను చాలా వరకు నియంత్రించవచ్చు. అదేవిధంగా లాంగ్ డ్రైవ్స్ చేసేవారు మాస్క్‌లను ధరించడం వల్ల ఎలాంటి ఎలర్జీలు మీ దరిచేరవు.
ఒకప్పుడు మహిళలైనా , పిల్లలైనా ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు వాష్‌రూమ్స్ వాడాలంటే కాస్త ఇబ్బంది పడేవారు. అక్కడ అపరిశుభ్రమైన వాతావరణం వల్ల అనీజిగా ఫీల్ అయ్యేవారు . కానీ ఇప్పుడు మాస్క్ వల్ల ఆ ఇబ్బంది తొలగినట్లైంది. ఎవరికైనా దగ్గున్నా, తుమ్ములు వచ్చినా ఇన్‌ఫెక్షన్స్ ఉన్నా మాస్క్ ధరించడం వల్ల ఎంతో ప్రొటెక్టివ్‌గా ప్రజలు ఉండగలుగుతున్నారు. ఇక వేసవిలోనూ మాస్క్‌లు ఎంతో రక్షణగా ఉండనున్నాయి.
ఈ మధ్యకాలంలో వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఆయా సీజన్ల లలో అధిక వర్షాలతో పాటు చలి తీవ్రత పెరిగింది. ఇప్పుడు వేసవిలోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరి వేసవిలో అందులోనూ ఆఫీస్‌లకు వెళ్లేవారు ఈ అధిక ఉష్ణోగ్రతల కారణంగా అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యం గా వేడి గాలులు మనిషిని విపరీతంగా వేధిస్తాయి. కొంత మంది ఈ వేడి గాలుల ప్రభావానికి ముక్క రంధ్రాలు పగలి , రక్తస్రావం జరుగుతుంది. ఈ క్రమంలో మాస్క్‌లు వాడటం వల్ల వేడి తీవ్రతను తట్టుకునే వెసులుబాటు ఉంటుంది.
బయటకి వెళ్లినప్పుడు మాస్క్ ధరిస్తే ప్రొటెక్షన్ లభిస్తుంది మరి ఇంట్లో కూడా మాస్క్‌లను ధరించాలా అన్న ప్రశ్నకు తప్పనిసరిగా ధరించాలనే చెప్పక తప్పదు. ఇప్పుడైతే వైరస్ ప్రభావం భారత్‌లో తగ్గింది. కానీ ఇక ఏ వైరస్ రాదన్న బరోసా మాత్రం లేదు. చైనాలో ప్రస్తుతం కరోనా మరోసారి విజృంభిస్తోందన్న వార్తలు వింటుంటే మున్ముందు ఏ రూపంలో వైరస్ అటాక్ చేస్తున్న భయబ్రాంతులైతే ఉన్నాయి. అందుకే బయటకి వెళ్ళేవారే కాదు ఇంట్లో ఉన్నవారు మాస్కులను ధరిస్తే మంచిది. ఎవరు ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌లు వైరస్‌లు తీసుకువస్తారో తెలియదు.
కాబట్టి వయస్సు పైబడిన వారు వారి ఆరోగ్య జాగ్రత్త నిమిత్తం మాస్కులు వాడటం లో ఎలాంటి తప్పులేదు. చిన్నపిల్లలు సైతం మాస్క్‌లను తప్పనిసరిగా వాడాలి. వారికి ఇప్పుడు కరోనా వైరస్ గురించి తెలుస్తోంది . కాబట్టి వారిని ఎడ్యుకేట్ చేసి మాస్క్‌ల ప్రాముఖ్యతను తెలపాల్సిన అవసరం ఉంది. పిల్లలు గుంపుగా ఉండటం ఒకరు తిన్నది మరొకరు తినడం చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం తుమ్మినా దగ్గినా అందరినీ టచ్ చేయడం ఇలా వారికి తెలియకుండా చాలా వరకు ఒకరితో ఒకరు వైరస్‌ను వ్యాప్తి చేస్తుంటారు. కాబట్టి వారి ఆరోగ్యం విషయంలోనూ ప్రొటెక్టివ్ గా ఉండాలంటే మాస్క్‌లను ధరించాలనీ సూచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రారంభంలో మాస్క్ ధరించినంత మాత్రన వైరస్ తగ్గదన్న వాదనలు వచ్చాయి. వేసుకున్నవారు వైరస్‌ల బారినపడ్డారు అలా అని వాటిని పక్కన పెట్టలేదు కారణం వైరస్ ప్రభావం పెద్దగా లేకపోవడం వ్లలే అని చెప్పాలి. కేవలం మాస్క్‌లను వాడటం వల్లనే చాలా మంది తమ ప్రాణాలను కాపాడుకోగలిగారు. మాస్క్ లను తేలిగ్గా తీసేయాల్సిన పనిలేదు. మరి మాస్కుల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ప్రజలు ఇప్పటికీ మాస్క్‌లను వీడటం లేదు. తమ రోజువారి జీవితంలో వాటిని భాగం చేసుకున్నారు.