Marriage: మన హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లిలో ఎన్నో ఆచార వ్యవహారాలను పాటిస్తూ పెళ్లి కార్యక్రమాన్ని జరుపుతారు. పెళ్లిలో చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సాంప్రదాయబద్ధంగానే జరుగుతుంది. అయితే పెళ్లిలో వరుడికాళ్లను వధువు తండ్రి కడగడమే కాకుండా ఆ నీళ్లను తలపై చల్లుకుంటారు. ఇలా వరుడి కాళ్లు కడిగి కన్య దానం చేస్తారు ఇలా చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి ఇలా చేయడం వెనుక శాస్త్రం ఏం చెబుతుంది అనే విషయానికి వస్తే…
పెళ్లి జరిగే సమయంలో వరుడు తూర్పు వైపుకు తిరిగి కూర్చునే ఉంటారు అయితే మీ పెళ్లి కార్యక్రమంలో భాగంగా వధువు తల్లి నీళ్లను పోస్తూ ఉండగా తండ్రి వరుడు కాళ్లను కడిగి కన్యాదానం చేస్తారు అయితే ఇలా చేయడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. చిన్నప్పటి నుంచి ఎంతో అలారం ముద్దుగా పెంచుకున్నటువంటి తమ కూతురిని ధర్మేచ కామేచ అర్థ మోక్షాలకి నీకు అర్పిస్తున్నాను అంటూ పెళ్లి కొడుకుకు కాళ్లు కడిగి కన్యాదానం చేస్తారు.
Marriage:
ఇలా పెళ్లికూతురని సాక్షాత్తు లక్ష్మీదేవి గారు అలాగే పెళ్లి కొడుకును శ్రీమన్నారాయణడిగాను భావించి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇలా పెళ్లిలో జరిగే ప్రతి ఒక్క తంతుకి ఎంతో అర్థం దాగి ఉంటుంది.ఇక జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో కూడా అర్థం ఉందని తెలుస్తుంది. జీలకర్ర బెల్లం విడదీయడానికి రాదు అలాగే భార్యాభర్తలు కూడా వైవాహిక జీవితంలో అంతే కలిసిమెలిసి ఉండాలని ఉద్దేశంతో వధూవరుల చేత జీలకర్ర బెల్లం పెట్టిస్తారు.