Health Tips: సాధారణంగా మన ఇంటి ఆవరణంలో కనిపించే బొప్పాయి పండులో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే. కేవలం బొప్పాయి పండు మాత్రమే కాకుండా బొప్పాయి ఆకులతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ముఖ్యంగా మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులతో బాధపడే వారికి బొప్పాయి ఆకు రసం ఎంతగానో దోహదపడుతుందని సంగతి తెలిసిందే .అయితే ఒక స్పూన్ బొప్పాయి రసం తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
మరి ఒక స్పూన్ బొప్పాయి రసం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని వస్తే..బొప్పాయి ఆకులను జ్యూస్ చేసి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ,జ్వరాలు అనేక రకాల అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది.ఇక ఈ బొప్పాయి ఆకురసంలో విటమిన్ ఏ ఈ సి కె బి సమృద్ధిగా లభిస్తాయి. తద్వారా ఇది అనారోగ్య సమస్యలు జ్వరాలు టైఫాయిడ్ వంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది. ఇక ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో అలాంటి వారికి ఇదొక దివ్య ఔషధం అని చెప్పాలి.
ఇక మలబద్ధక సమస్యతో బాధపడే వారు కూడా ఒక స్పూన్ బొప్పాయి రసం తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.చాలామంది జుట్టు రాలే సమస్యతో విపరీతంగా బాధపడుతున్నారు. అంతేకాక చుండ్రు , జుట్టులో దురద వంటి సమస్యలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి వారు ఈ జ్యూస్ తాగటం వల్ల జుట్టు సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే ఇది మన శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా అణిచివేయడానికి కూడా దోహదం చేస్తుంది.