Mango Leaves: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై అలాగే ఆహారపై దృష్టి పెట్టకపోవడంతో చాలామంది అధిక శరీర బరువు పెరుగుతున్నారు. ఇలా అధిక శరీర బరువు పెరిగినవారు బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన ఎలాంటి ఫలితాలు కలగడం లేదు. దీంతో ఎంతో డిప్రెషన్లకు కూడా గురవుతున్నారు అయితే ఇలా అధిక బరువు సమస్యతో బాధపడే వారికి మామిడాకులు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్పాలి. మరి మామిడాకులతో బరువు ఎలా తగ్గడం అనే విషయానికి వస్తే…
మామిడి ఆకుల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబియల్ గుణాలు, అత్యధికంగా ఫైబర్ లభిస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే మామిడి ఆకుల కషాయాన్ని సేవిస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇప్పుడు మామిడి ఆకుల కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.దాదాపు10 నుంచి 15 మామిడి ఆకులను తీసుకొని వాటిని శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్లలో బాగా మరగనివ్వాలి. చల్లబడిన తర్వాత ఈ నీటిని వడగట్టుకుని ఉదయాన్నే ప్రతిరోజు పరగడుపున సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.
Mango Leaves: కంటి చూపు మెరుగుపడుతుంది..
ఇలా పరగడుపున ఈ మామిడాకుల కషాయం తాగటం వల్ల శరీరంలో పేరుకుపోయినటువంటి చెడు కొవ్వు మొత్తం కరిగి శరీర బరువు తగ్గడానికి ఎంత దోహదపడుతుంది. అయితే ఈ చిట్కాను ఉపయోగించే ముందు ఒకసారి నిపుణుల సలహా తీసుకోవడం ఎంతో మంచిది అదే విధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ప్రతిరోజు ఇతర సమస్యలకు మందులు ఉపయోగించేవారు మాత్రం ఇలాంటి చిట్కాలను పాటించకపోవడమే మంచిది. శరీర బరువు తగ్గాలనుకున్న వారు మాత్రమే కాకుండా చిన్న వయస్సులోనే కంటి చూపు మందగించి ఇబ్బంది పడుతున్న వారు ఈ కషాయాన్ని సేవిస్తే కంటిచూపు మెరుగుపడే అవకాశాలు ఉంటాయి.