Mango Leaves: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా శరీర బరువు పెరిగిపోతున్నారు. ఇలా అధిక శరీర బరువు సమస్యతో బాధపడేవారు ఎన్నో రకాల పద్ధతుల ద్వారా శరీర బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలోనే జిమ్ లో పెద్ద ఎత్తున కష్టపడుతూ శరీర బరువు తగ్గించుకోగా మరికొందరు సహజ చిట్కాలను ఉపయోగించి శరీర బరువు తగ్గుతూ ఉంటారు. కీలకపాత్ర పోషిస్తాయి అనే విషయం చాలా మందికి తెలియదు.
మామిడాకుల ద్వారా ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజసిద్ధంగా శరీర బరువును తగ్గొచ్చు మరి మామిడాకులతో శరీర బరువు ఎలా తగ్గుతారు వాటితో ఏం చేయాలి అనే విషయానికి వస్తే……. మామిడి ఆకుల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబియల్ గుణాలు, అత్యధికంగా ఫైబర్ లభిస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే మామిడి ఆకుల కషాయాన్ని సేవిస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇప్పుడు మామిడి ఆకుల కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
Mango Leaves:
దాదాపు10 నుంచి 15 మామిడి ఆకులను తీసుకొని వాటిని శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్లలో బాగా మరగనివ్వాలి. చల్లబడిన తర్వాత ఈ నీటిని వడగట్టుకుని ఉదయాన్నే ప్రతిరోజు పరగడుపున సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ చిట్కాను పాటించాలి అనుకుంటే మొదట నిపుణుల సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.షుగర్ వ్యాధితో బాధపడేవారు లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మందులు ఉపయోగించేవారు వైద్యుల సలహాలు సూచనలు మేరకు ఈ పద్ధతులను అనుసరించడం ఎంతో మంచిది.