Mango: పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం మనకు తెలిసిందే. అందుకే ప్రతిరోజు ఆహారంలో భాగంగా పెరుగును తీసుకోవడం వల్ల పెరుగులో ఉన్నటువంటి ప్రో బ్యాక్టీరియా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అందుకే ప్రతిరోజు ఆహార పదార్థాలలో భాగంగా పెరుగును తప్పనిసరిగా ఉపయోగిస్తాం.అయితే పెరుగును తిన్న తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలను తినకూడదని చెబుతుంటారు అయితే చాలామంది పెరుగుతో పాటు ఇతర ఆహార పదార్థాలను కూడా కలిపి తింటారు. ఇలా తినడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా తలెత్తుతాయి.
ముఖ్యంగా చాలామంది పెరుగుతో పాటు మామిడిపండును తినడానికి ఇష్టపడతారు.ఇలా ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల చాలా రుచికరంగా ఉన్నప్పటికీ ఇలా పెరుగుతో పాటు మామిడి పండ్లు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి పెరుగును మామిడి పండును తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి అనే విషయానికి వస్తే…పెరుగు మన శరీరానికి చలువ చేస్తుంది కానీ మామిడి పండులో వేడి కలిగించే గుణం ఉంటుంది. ఇలా ఒకేసారి చలువ వేడి చేసే పదార్థాలను తినడం వల్ల మన శరీరం ఉష్ణోగ్రతలు అసమతుల్యం అవుతాయి.
Mango:
ఈ విధంగా శరీర ఉష్ణోగ్రతలు అసమతుల్యం అవడం వల్ల చర్మ సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. చర్మంపై దద్దుర్లు ఏర్పడేటప్పుడు మొటిమలు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. మామిడి పండ్లు, పెరుగు ఒకేసారి తిన్నా, లేక వెంట వెంటనే తీసుకున్నా కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల వెంటనే అనారోగ్యానికి గురవుతారు. పెరుగు మామిడి పండును తినటం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి కనుక పెరుగుతో తిన్న తర్వాత గంట వరకు మామిడిపండును తినకపోవడమే మంచిది. మామిడి పండుతో కూల్ డ్రింక్స్, స్పైసీ ఫుడ్స్, కాకరకాయ, పాలు, నీరు కూడా.. సో ఫ్రెండ్స్ ఇటువంటి ఆహారాలను పెరుగుతో పాటు తినకూడదు.