Tuesday: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి అంకితం చేసే ఆ దేవుడిని ఆరోజు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే మంగళవారం కూడా ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తూ ఉంటారు అందుకే మంగళవారం ఆంజనేయుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు అయితే మన సాంప్రదాయాల ప్రకారం మంగళవారం రోజు కొన్ని రకాల పనులు చేయడం ఎంతో శుభ సూచికంగా భావిస్తారు అలాగే కొన్ని పనులను చేయటం మంచిది కాదని చెబుతుంటారు. మరి మంగళవారం చేయాల్సిన చేయకూడని పనులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
మంగళ వారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే మంగళవారం శుభకార్యాలను తలపెట్టరు. అలాగే మంగళవారం గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం కూడా మంచిది కాదు. అలాగే మంగళవారం ఎవరైతే డబ్బును అప్పుగా ఇస్తారు ఆ డబ్బు తిరిగి రాబట్టడం చాలా కష్టం అవుతుంది. ఇక మంగళవారం పొరపాటున కూడా కొత్త బట్టలను కొనుక్కోరాదు అలాగే వేసుకోకూడదు.
ఇక మంగళవారం తప్పనిసరిగా ఆంజనేయుని ధ్యానించడం వల్ల ధైర్యం చేకూరుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల కుజగ్రహ ప్రభావం కారణంగా కలిగే అనేక ప్రమాదాలను నివారించవచ్చు. మంగళవారం రోజు ఎరుపు రంగు దుస్తులను ధరించి ఎర్రటి పుష్పాలతో కుజుడికి పూజ చేయడం వల్ల కుజ గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే ప్రమాదాల నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఇలా మంగళవారం కుజుడిని ఆంజనేయుడిని పూజించడం ఎంతో మంచిది.