Tue. Jan 20th, 2026

    Manchu Family:  మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య గొడవ రచ్చకెక్కింది. గత కొన్నేళ్ళుగా మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు ఉన్నాయనే మాట టాలీవుడ్ సర్కిల్ లో ఉంది.  వీరిద్దరూ కలిసి మాట్లాడుకోవడం కూడా లేదని టాక్. అయితే ఈ గొడవల విషయం ఇప్పటి వరకు నాలుగు గోడల మధ్యనే రచ్చ నడిచింది. వారి మధ్య వైరం ఎందుకు వచ్చింది అని పక్కన పెడితే ఇప్పుడు వారి మధ్య ఈ గొడవ తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం మంచు మనోజ్ పెళ్లి వేడుకలో విష్ణు అలా చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోయారు.

    Manchu Vishnu - Manchu Manoj: మంచు విష్ణు, మనోజ్ మధ్య గొడవలు.. సీరియస్ అయిన  మంచు వారబ్బాయి.. | Disputes between Manchu Brothers Vishnu and Manoj here  the main story behind pk– News18 Telugu

    ఇక అన్నదమ్ముల మధ్య గొడవని సద్దుమనిగించే ప్రయత్నం మంచు లక్ష్మి చేస్తుంది. అయితే ఇప్పుడు ఏకంగా మంచు మనోజ్ పేస్ బుక్ స్టేటస్ లో ఒక వీడియో పెట్టారు. దాంట్లో మంచు విష్ణు ఓ ఇంట్లోకి వచ్చి ఎవరితోనో గొడవ పడుతున్నాడు. దాంట్లో మంచు వాయిస్ లో మాట్లాడుతూ ఇలా ఇళ్ళల్లోకి వచ్చి కుటుంబ సభ్యులని కొడుతూ ఉంటాడు.  రెగ్యులర్ గా ఇలా వచ్చి కొడుతూ ఉంటాడు అని మనోజ్ చెప్పాడు. పేస్ బుక్ లో పెట్టిన కొద్ది సేపటికే ఈ వీడియో వైరల్ గా మారింది.

    Manchu Mohan Babu and Vishnu to attend Tirupati Court today in 2019 case

    దీంతో అసలు మంచు విష్ణు, మనోజ్ మధ్య ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మంచు విష్ణు, మనోజ్ మధ్య గొడవలు ఈ వీడియోతో తారాస్థాయికి వెళ్లాయనే మాట వినిపిస్తుంది. ఇక మనోజ్ ఈ ఘటనపై పోలీసులకి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతూ ఉండగా మంచు మోహన్ బాబు కలుగజేసుకొని ఇద్దరిపై సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో మంచు మంనోజ్ వెనక్కి తగ్గాడు అనే మాట వినిపిస్తుంది. ఇక ఈ వీడియో వివాదంపై మంచు మనోజ్, విష్ణుతో కలిసి మోహన్ బాబు మీడియా ముందుకి వచ్చి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.