Tue. Jan 20th, 2026

    Malavika Mohanan: మాళవిక మోహనన్ తాజాగా ప్రభాస్‌తో నటిస్తున్న “రాజా సాబ్‌” సినిమాలో హీరోయిన్‌గా ఎంపికై, తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. తమిళం, మలయాళ డబ్బింగ్‌ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మాళవిక ఇప్పుడు డైరెక్ట్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆమె తండ్రి కె.యు. మోహనన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కావడం విశేషం. ఆయన షారుక్‌ ఖాన్ నటించిన ‘డాన్’, ‘తలాష్’, ‘ఫక్రే’ వంటి చిత్రాలకు కెమెరా బాధ్యతలు నిర్వర్తించారు.

    కేరళలో పుట్టిన మాళవిక చిన్నతనంలో ముంబైకి వెళ్లి అక్కడే చదువుకుంది. మాస్‌ మీడియా డిగ్రీ చేసినా, ఆమె అసలైన ఆసక్తి సినిమాల పట్లే ఉండేది. ఓ సందర్భంలో తన తండ్రి యాడ్‌ ఫిల్మ్‌ షూటింగ్‌ జరుగుతున్న లొకేషన్‌ వెళ్లిన మాళవికను మమ్ముట్టి గమనించారు. ఆమె నటనపై ఆసక్తిని చూసిన మమ్ముట్టి, తన కుమారుడు దుల్కర్ సల్మాన్ సినిమాలో అవకాశం ఇప్పించారు. అలా “పట్టమ్ పొలే” అనే మలయాళ చిత్రంతో ఆమె కెరీర్‌ ప్రారంభమైంది.

    ఆ సినిమాకి సంబంధించిన కాస్ట్యూమ్ డిజైనర్ అనారోగ్యం కారణంగా మానేస్తే.. మాళవిక తన దుస్తులు తానే డిజైన్ చేసింది. ఈ ఘటన తరువాత ఆమెకు ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఆసక్తి పెరిగి “ది స్కార్లెట్ విండో” అనే బ్రాండ్‌ ప్రారంభించింది. సోషల్ మీడియాలో ఆమె గ్లామర్ ఫోటోలు పోస్టు చేస్తుంటే వచ్చిన ట్రోల్స్‌కు స్పందిస్తూ “చీరతో కూడిన” ఓ సెమీ ట్రెడిషనల్ ఫొటోను పోస్ట్ చేసి, మహిళల పట్ల సమాజం చూపే మొసలి నీళ్ళ కదలికలపై తన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది.

    malavika-mohanan-vijay-is-a-hot-beauty-who-escaped-the-cinema
    malavika-mohanan-vijay-is-a-hot-beauty-who-escaped-the-cinema

    Malavika Mohanan:  ప్రభాస్ అద్భుతంగా ఉంటారని చెప్పింది.

    విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న “హీరో” అనే సినిమాతో మాళవికకు తొలిసారిగా తెలుగులో అవకాశం వచ్చినా, ఆ చిత్రం నిలిచిపోయింది. తరువాత ప్రభాస్‌తో వచ్చిన అవకాశం ఆమెకు బాగా దక్కింది. ప్రభాస్‌తో చేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ “షూటింగ్ మొదలైన వారం రోజుల్లోనే ఆయన ఇంటి నుంచి చాలా రుచికరమైన వంటకాలు వచ్చేవి” అని చెప్పింది. దాదాపు 30-40 మందికి సరిపడే వంటలతో అతిథి సత్కారం చేసే ప్రభాస్ అద్భుతంగా ఉంటారని చెప్పింది.

    మలయాళమ్మాయి అయిన మాళవికకి మట్టి పాత్రలో వండిన చేపల కూర అంటే ఎంతగా ఇష్టమో చెప్పింది. డైటింగ్ పక్కనపెట్టి, తల్లి చేత వండించిన చేపల కూర తింటూ రిలాక్స్ అవుతుందట. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌ ఆమె చిన్ననాటి స్నేహితుడు, ఇద్దరూ ఒకే బిల్డింగ్‌లో పెరిగారని, అతని గురించి ఎంతో ప్రత్యేకంగా భావిస్తానని చెప్పింది.

    తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకమేనని మాళవిక చెబుతుంది. “ఒక్క సినిమాలో కనిపించినా చాలు.. తెలుగు వారు ఎంతగానో ప్రేమిస్తారు. అలాంటి అభిమానులు మరే భాషలో ఉండరని నాకు అనిపిస్తుంది” అని చెప్పడం విశేషం. సినిమా, ఫ్యాషన్, వ్యక్తిత్వం, అభిప్రాయాలలో తనదైన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతున్న మాళవిక మోహనన్ భవిష్యత్‌లో డైరెక్టర్ లేదా సినిమాటోగ్రాఫర్‌గా మారాలనే లక్ష్యాన్ని కూడా ఉంచుకున్నది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.