Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు , దర్శకథీరుడు రాజమౌళి సినిమా ఎప్పుడు తెరమీద వస్తుందా అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సూపర్ డూపర్ హిట్ తర్వాత రాజమౌళి చేస్తున్న మూవీ కావడంతో అందరి చూపు ఈ మూవీపైనే పడింది. ప్రిన్స్ మహేష్ కూడా చాలా రోజుల గ్యాప్ తర్వాత చేయబోతున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఓ రకమైన ఆతృత పెరిగిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే వీరిద్దరికీ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ తో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ మూవీ పూర్తి కాగానే రాజమౌళితో సినిమా సెట్స్ మీదకు రానుందని సమాచారం. ఈ మూవీని ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ పాన్ వరల్డ్ సినిమాగా తీయబోతున్నారట. అందుకోసం భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎలాంటి రికార్డ్స్ సెట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీతో జక్కన్న క్రేజ్ వరల్డ్ వైడ్ గా పెరిగిపోయింది. దీంతో మహేష్ బాబుతో చేసే మూవీపై భార అంచనాలు ఏర్పడ్డాయి. ప్రిన్స్ తో అమేజాన్ ఫారెస్ట్ అడవుల్లో ఓ సాహసోపేతమైన సినిమాని తెరకెక్కించే విధంగా అన్ని రకాల ప్రణాళికలు చేస్తున్నారని జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
రాజమౌళి సినిమా అంటే మినిమమ్ రెండు సంవత్సరాలు పడుతుంది. అవును మీరు విన్నది నిజమే. బహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు కూడా అలాగే తీశారు. అందుకే జక్కన్న అంటే కచ్చితంగా హీరోలు ఏళ్లకు ఏళ్లు తమ డేట్స్‌ని ఇచ్చేస్తుంటారు. ఈ క్రమంలోనే మహేష్ రాజమౌళికి మూడేళ్ల` పాటు తన డేట్స్ ని రాజమౌళికి ఇచ్చారని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇక ఈ అడ్వెంచరస్ మూవీ స్క్రీప్ట్ ని కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు ఫైనల్ చేశారని తెలుస్తోంది. మహేష్ తో కలిసి కథ గురించి డిస్కస్ కూడా చేశారట. గుంటూరు కారం పూర్తికాగానే త్వరలోనే ఈ మూవీ స్టార్ట్ చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నారు. బాహుబలి సినిమా మాదిరిగానే మహేష్ మూవీని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
రాజమౌళి ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట కోసం గ్రౌండ్ లెవెల్ లో ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. అందుకే కేవలం ఫస్ట్ పార్ట్ కోసమే దాదాపుగా మూడేళ్ల సమయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే మూవీ 2027 వరకు రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక రెండవ భాగానికి ఎంతలేదన్నా రెండేళ్ల వరకు టైం తీసుకుంటారని టాక్. అందుకే రాజమౌళి 2029 నాటికి సినిమా కోసం డేట్స్ ఇవ్వనున్నారట. ఇలా చూసుకుంటే రాజమౌళి సినిమా కోసం ఎంతలేదన్నా మహేష్ బాబు ఐదారేళ్లపాటు తన డేట్స్ ఇచ్చారని చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్ మూవీ మిస్సయిన అవార్డులను మహేష్ తో తీయబోయే ఈ మూవీ ద్వారా పొందేందుకు రాజమౌళి భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇన్ని సంవత్సరాలు ఒక్క మూవీకి కేటాయిస్తున్నట్లు ఇన్ఫర్మేషన్.