Maha Shivaratri: దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంత ఘనంగా జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి పండుగ ఒకటి. ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ మార్చి 8వ తేదీన ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. మహాశివరాత్రి అంటే సాక్షాత్తు ఆ పార్వతి పరమేశ్వరులకు వివాహం జరిపించారు. అంతేకాకుండా ఈ శివరాత్రి పండుగ రోజు ఉపవాస దీక్షలకు పెద్ద ప్రాధాన్యత ఉంటుంది. శివరాత్రి రోజు ఉపవాస జాగరణలను కనుక చేస్తే వారికి మోక్షం లభిస్తుందని భావిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఎంతోమంది ఉదయమే శివపార్వతులకు పూజ చేసి అనంతరం ఉపవాసం జాగరణలు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది ఉపవాసం చేయలేని వారు ఉంటారు అంటే వృద్ధులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ లేదా ఇతరత కారణాలవల్ల కొంతమంది ఉపవాసం చేయలేరు అలాంటివారు ఉపవాసం చేసినటువంటి మోక్షాన్ని పొందాలి అంటే ఈ చిన్న పని చేస్తే చాలని పండితులు చెబుతున్నారు.
మహాశివరాత్రి పండుగ రోజు కొన్ని కారణాల వల్ల ఉపవాసం లేనటువంటి వారు పేద బ్రాహ్మణుడికి మీ సత్యానుసారం ఒక స్పటిక లింగాన్ని ఇవ్వండి. లేకపోతే ఆ బ్రాహ్మణుడికి కూరగాయలను కూడా దానం ఇవ్వటం వల్ల అంతా శుభ ఫలితాలే కలుగుతాయి. ఇలా ఉపవాసం లేనటువంటి వారు స్పటిక లింగం లేదా కూరగాయలను దానం చేయడం వల్ల ఉపవాసం చేసినటువంటి పుణ్యఫలం కలుగుతుంది. ఈ చిన్న పని చేస్తే కనుక కోటి జన్మల పుణ్యఫలం మీకు దక్కుతుంది. మీ జీవితంలో మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి.