Lunar Eclipse: మన హిందూ శాస్త్రాల ప్రకారం సూర్య చంద్ర గ్రహణాలు సమయంలో ప్రజలు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, లేదంటే పుట్టబోయే బిడ్డ మీద గ్రహణ ప్రభావం పడుతుందని తెలుపుతున్నారు. అయితే మే 5వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం
ఈ ఏడాది మే 5వ తేదీన మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది.ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది.భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 8 గంటల 44 నిమిషాల నుంచి తెల్లవారుజామున 1.20 నిమిషములకు ముగుస్తుంది.చంద్రగ్రహణం దాదాపు 5 గంటల వరకు ఉంటుంది. అయితే గ్రహణా ప్రభావం భారతదేశంలో కనిపించకపోయినా గ్రహణం ఏర్పడే సమయంలో గర్భిణీ స్త్రీలు కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు.
Lunar Eclipse:
అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ లు నీరు కూడా తాగకూడదు. ఎందుకంటే గ్రామ సమయంలో చంద్రుడి వల్ల వెలువడే కిరణాలు విషపూరితంగా ఉంటాయి. అందువల్ల చంద్రగ్రహణం సమయంలో ఆహారం మీరు వంటివి అసలు తీసుకోకూడదు. అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు దైవారాధన చేస్తూ ఆ దేవుని స్మరిస్తూ ఉండాలి. అలాగే పొరపాటున కూడా గ్రహణ సమయంలో ఇంటి నుండి బయట అడుగు పెట్టకూడదు. అలాగే చంద్రుడి నుండి వచ్చే కాంతి గర్భిణీ స్త్రీ మీద పడకుండా ఉండేలా చూసుకోవాలి. అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పొరపాటున కూడా నిద్రించకూడదని పండితులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఈ నియమాలను పాటించకపోతే గ్రహణ ప్రభావం వారి కడుపులో పెరిగే పిల్లలు మీద పడే అవకాశం ఉంటుంది.