Technology: కృత్రిమ మేధస్సు భవిష్యత్తులో మానవ సమాజాన్ని శాసిస్తుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భవిష్యత్తులో మన ప్రతి అవసరాన్ని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ముందుగానే పసిగట్టి కావాల్సినది అందించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే అమెరికాలో టెస్లా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో నడిచే కార్లని తయారు చేస్తుంది. ఇక గూగుల్ సెర్చ్ ఇంజన్ కూడా కృత్రిమ మేధస్సుతోనే నడుస్తుందని చాలా మందికి తెలియదు. మనం ఏ అంశాన్ని అయితే ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేస్తామో `వాటినే మనకి ఎక్కువగా రికమండ్ చేస్తాయి. అలాగే మన యాప్స్, యుట్యూబ్ లో కూడా వాటికీ సంబందించిన యాడ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీనికి కారణం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ అనే విషయం చాలా మంది గుర్తించరు.
అందుకే గూగుల్ లో శోధించే ఎలాంటి సమాచారం అయిన జాగ్రత్తగా వెతకాలి అని చెబుతూ ఉంటారు. ఇక చాట్ జీపీటీ అనే చాట్ బొట్ ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది. ఇందులో మనకి కావాల్సిన ఏ సమాచారం అయిన చాలా సులభంగా వచ్చేస్తుంది. లీవ్ లెటర్ అని `టైప్ చేస్తే దానికి సంబందించిన శాంపిల్ వచ్చేస్తుంది. అలాగే ఒక కథకి సంబందించిన ఐడియాని అందులో టైప్ చేస్తే. అదే ఆటోమేటిక్ గా ఇంటరెస్టింగ్ కథని తయారు చేసి ఇస్తుంది. లవ్ లెటర్ కావాలన్నా కూడా రాసి ఇస్తుంది. అయితే భవిష్యత్తులో టెక్నాలజీతో పనిచేసే అన్నింట్లో కూడా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఉంటుంది.
ఈ వీడియోని షేర్ చేసిన ఆనంద్ మహేంద్రా భవిష్యత్తులో ఇలాంటి మోసపూరిత కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆరంభంలో ఇది భాగానే ఉంటుంది. కాని మన వ్యతిరేకులు ఇలాంటి వాటిని ఉపయోగించి తప్పుడు వీడియోలు క్రియేట్ చేసి మనమే చేసాం అనే విధంగా భ్రమింపజేసే అవకాశం ఉంది. ఇలాంటి ప్రమాదకరమైన టెక్నాలజీ చేతుల్లోకి భవిష్యత్తులో మనం వెళ్ళబోతున్నాం. వీటిని నియంత్రించాలంటే కచ్చితంగా కచ్చితమైన సెక్యూరిటీ, రక్షణ వ్యవస్థ ఉండాలని ఆనంద్ మహేంద్రా తెలిపారు. ఏది ఏమైనా ఈ వీడియో చూసిన తర్వాత కచ్చితంగా భవిష్యత్తుపై చాలా మంది భయపడటం పక్కా అనే మాట వినిపిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.