Tue. Jan 20th, 2026

    Lavanya Tripathi : దేశ ప్రజలంతా 500 ఏళ్లుగా ఎదురుచూసిన శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట ఎట్టకేలకు ఎంతో వైభవంగా జరిగింది. అయోధ్య నగరం మొత్తం శ్రీరాముని నామస్మరణతో ఆధ్యాత్మిక శోభన సంతరించుకుంది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ క్రతువుని స్వయంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి చెమటోడ్చిన శ్రామికులపై  ఆలయ ప్రాంగణంలోనే  పూలను చల్లి సత్కరించారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ  అత్యున్నతమైన కార్యక్రమాన్ని కనులార వీక్షించాలని బాలీవుడ్,టాలీవుడ్ కొలీవుడ్ ఇలా అన్ని రంగాలకు చెందిన సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు,స్పోర్ట్స్ దిగ్గజాలు ప్రభుత్వ అధికారులు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్ ఆహ్వానం రావడంతో అయోధ్యకు వెళ్లి రామ మందిరం కార్యక్రమాన్ని వీక్షించారు. ఇదే క్రమంలో మెగా వారి కోడలు లావణ్య త్రిపాఠి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ షేర్‌ చేసింది. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వేరేలవుతోంది

    lavanya-tripathi-emotional-post-on-ayodhya-ram-mandir
    lavanya-tripathi-emotional-post-on-ayodhya-ram-mandir

    లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది పెళ్లికి ముందే కాదు పెళ్లయిన తర్వాత కూడా రకరకాల ఫోటోషూట్ పిక్స్ తో అందరిని అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా లావణ్య ఎరుపు రంగు చీర కట్టుకుని రాములవారి డిజైన్స్ లో ఉన్న ఆభరణాలను ధరించి ఉన్న ఫోటోలను నెట్టింట్లో పోస్ట్ చేసింది ఆ ఫోటోలతో పాటుగా ఎమోషనల్ నోట్ ను షేర్ చేసింది.

    lavanya-tripathi-emotional-post-on-ayodhya-ram-mandir
    lavanya-tripathi-emotional-post-on-ayodhya-ram-mandir

     “రాముని జన్మించిన నెలపైనే నేను పుట్టాను. నా పుట్టిన ఊరైన అయోధ్యలో రాములవారి ప్రాణ ప్రతిష్ట వేడుకను చూడటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇండియన్స్ అందరూ  గర్వించదగ్గ విషయం ఇది. ఈ చారిత్రాత్మక వేడుక సందర్భంగా  నేను రామ్‌ పరివార్‌ అభరానలను ధరించడం సంతోషంగా ఉంది. విగ్రహ ప్రాణ ప్రతిష్ట కేవలం రాముల వారి అయోధ్యలోనే కాదు దేశమంతా ఉంది.

    lavanya-tripathi-emotional-post-on-ayodhya-ram-mandir
    lavanya-tripathi-emotional-post-on-ayodhya-ram-mandir

    రాముడి రాక సందర్భంగా దేశ ప్రజలంతా సంబరాలు జరుపుకుంటున్నారు. భారతీయులందరినీ ఏకం చేసే మహోన్నతమైన ఉత్సవం ఇది. ఈ ఒక్క వేడుక ఐక్యమత్యాన్ని సూచిస్తుంది. మనసుని రాముడు భక్తితో  నింపుకుందాం.. అయోధ్యలోనే కాదు దేశమంతా శాంతియుతంగా ఉండాలని ఆశిద్దాం.. జై శ్రీరామ్‌” అంటూ ఎమోషనల్ కోట్ ని షేర్ చేసింది లావణ్య.