Lavanya Tripathi : నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అనే ఒక్క డైలాగుతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన హీరోయిన లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నానితో భలే భలే మగాడివోయ్, అక్కినేని నాగేశ్వరరావుతో సోగ్గాడే చిన్నినాయన వంటి సినిమాలు చేసింది. ఈ సినిమాల హిట్ తో లావణ్యకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వచ్చింది.
వరుణ్ తో మిస్టర్ సినిమా చేసింది. ఆ మూవీతో లవ్, వరుణ్ మధ్య ప్రేమ చిగురించింది. కొన్ని సంవత్సరాల పాటు ఎవరికీ తెలియకుండా ఈ జంట సీక్రెట్‌గా తమ ప్రేమాయణాన్ని సాగించింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో ఫారెన్ లో ఘనంగా పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత వెకేషన్స్‌కు వెళ్తు ఫుల్ ఎంజాయ్ చేశారు ఈ కపులు. కానీ గత కొంత కాలంగా లావణ్య సైలెంట్ అయిపోయింది. రీసెంట్ గా ఏపీలో ఘనంగా జరిగిన మెగా మామ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా లావణ్య రాలేదు. లావణ్య ఎందుకు రాలేదబ్బా అని ఆరా తీయగా, తన కాలికి గాయమై ఇంటికే పరిమితమైందని తెలిసింది.
ఈ క్రమంలో ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న లావణ్య లావణ్య సోషల్ మీడియాలో తమ అభిమానులతో టైంపాస్ చేస్తోంది. రీసెంట్ గా ఈ భామ తన ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించింది. అందులో ఓ నెటిజన్ లావణ్యకు పెళ్లి ప్రపోజల్ పెట్టారు. మేడం మీరంటే నాకు చాలా చాలా ఇష్టం, ఈ జన్మలో వరుణ్‌ను పెళ్లి చేసుకున్నారు కదా. కనీసం వచ్చే జన్మలోనైనా నన్ను పెళ్లి చేసుకోండి అని పాపం రిక్వెస్ట్ చేశాడు. అభిమాని ప్రపోజల్ కు లావణ్య షాక్ అయ్యింది.
ఇక మెగా కోడలు సమాధానం ఇస్తూ.. “పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటారు. ఈ జన్మలో కాదు, వచ్చే జన్మకు..ఇంకా చెప్పాలంటే జన్మ జన్మలకు వరుణే నా భర్త”అని సామాధానం ఇచ్చింది. లావణ్య సమాధానానికి మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీనిని బట్టి లావణ్యకు వరుణ్ అంటే ఎంత ఇష్టమో అర్థమవుతోందంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.