Tue. Feb 10th, 2026

    Kubera: ఇప్పటి సినిమాల ట్రెండ్‌ చూస్తే వీకెండ్‌ వరకే కలెక్షన్ల హవా కనిపిస్తోంది. పాజిటివ్‌ టాక్‌ వచ్చిన సినిమాలు కూడా వారాంతం తర్వాత క్రేజ్ కోల్పోతుంటాయి. వచ్చే వారం నాటికి కొత్త సినిమాలు విడుదలై పాత చిత్రాలను వెనక్కి నెట్టి ముందుకు వస్తుంటాయి. అయితే ఈ వీకెండ్‌ మాత్రం ఈ ట్రెండ్‌కి భిన్నంగా మారింది. కొత్తగా వచ్చిన సినిమాలు ఆక్యుపెన్సీ పరంగా అంతగా మెప్పించకపోవడం, పాత సినిమా ఓ రేంజ్‌లో నడుస్తుండటం విశేషం.

    ఈ నెల రెండు వారాల క్రితం రిలీజ్ అయిన ‘కుబేర’ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద స్టడీగా నడుస్తోంది. వర్కింగ్ డేస్‌లో ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్నా, వీకెండ్‌ రాగానే ధనుష్-నాగ్ కాంబో ఆకర్షణతో మల్టీప్లెక్స్‌ల్లో మంచి వసూళ్లు రాబడుతోంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి మెట్రోల్లో ‘కుబేర’కి రెస్పాన్స్ బాగుంది. మళ్లీ కొత్త సినిమాల కంటే పాత సినిమాకు ఇంత రెస్పాన్స్ రావడం అరుదైన విషయమే.

    kubera-nithin-and-manchu-vishnu-are-the-victims-of-dhanushs-movie
    kubera-nithin-and-manchu-vishnu-are-the-victims-of-dhanushs-movie

    Kubera: లీడ్ తీసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

    ఇక ఈ వీకెండ్‌లో వచ్చిన ‘తమ్ముడు’ సినిమా మాత్రం తొలి షో నుంచే నెగెటివ్ టాక్‌తో ఢీలా పడిపోయింది. శని, ఆదివారాల్లో కూడా వసూళ్లు పెద్దగా ఆశాజనకంగా లేకపోవడంతో నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను ప్రమోట్ చేయడాన్ని తగ్గించినట్టు తెలుస్తోంది. అలాగే గత వారం వచ్చిన ‘కన్నప్ప’ కూడా ఫస్ట్ వీకెండ్ తర్వాత గ్రాఫ్‌ డౌన్‌ అయ్యింది. ఈ వారం కొత్త బూస్ట్ లేకపోవడంతో మరింతగా కూలిపోయింది. వీకెండ్ వచ్చినా ఆక్యుపెన్సీ పెరగకపోవడం ఆ సినిమా పరిస్థితిని బట్టే తెలుస్తోంది.

    అన్ని సినిమాలను వెనక్కి నెట్టి, రెండు వారాల పాత సినిమాగా ‘కుబేర’ తిరిగి లీడ్ తీసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐతే ఈ సినిమా తమిళ వెర్షన్ మాత్రం తొలి వీకెండ్‌ తర్వాత పూర్తిగా ఫ్లాప్‌ అయిపోయింది. అక్కడ డిజాస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం తెలుగులో మాత్రం సూపర్ హిట్ స్థాయికి చేరడం విశేషమే.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.