Wed. Jan 21st, 2026

    Krishna Vamsi : తెలుగు చిత్ర పరిశ్రమలో క్రియేటివ్ డైరెక్టర్‌గా అసాధారణమైన పాపులారిటీని సంపాదించుకున్న దర్శకులు కృష్ణ వంశీ. ఆయన తాజాగా తెరకెక్కించిన సినిమా రంగమార్తాండ. ఈ మూవీలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, ‘శివగామి’ రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, అనసూయ భరద్వాజ్, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ కోసం అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. కరోనాతో పాటు మరెన్నో అడ్డంకులను దాటుకొని ఇప్పుడు రంగమార్తాండ థియేటర్స్‌లో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.

    తెలుగువారి పండుగ ఉగాది సందర్భంగా రంగమార్తాండ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం చిన్న గ్యాప్ కూడా తీసుకోకుండా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. గతకొంతకాలంగా కృష్ణ వంశీకి హిట్ లేదు. అయినా ఆ ప్రభావం కాస్త కూడా ఈ చిత్రంపై కనిపించడం లేదు. సాధారణంగా ఏ సినిమానైనా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశాక ఇండస్ట్రీలోని ప్రముఖులకి ప్రివ్యూ వేసి సినిమాపై అభిప్రాయాలను తెలుసుకుంటుంటారు.

    Krishna Vamsi is sure to have a huge hit this time with Rangamarthanda movie
    Krishna Vamsi is sure to have a huge hit this time with Rangamarthanda movie

    Krishna Vamsi : ఈ సినిమాతో మళ్ళీ ‘కృష్ణ వంశీ ఈజ్ బ్యాక్’

    కానీ, రంగమార్తాండ సినిమా సెన్సార్ కాకముందే టాలీవుడ్ దర్శకులకి, ప్రముఖులకి ప్రత్యేకంగా షోలు వేశారు. ఈ విషయంలో కృష్ణ వంశీకి ఓ రకంగా పెద్ద ఛాలెంజ్ ని ఎదుర్కున్నట్టే అనుకోవాలి. ఆయనకి సినిమాపై ఎంత నమ్మకం లేకపోతే ఇలా ప్రివ్యూ వేస్తారు. ఆ నమ్మకం నిజమయింది. ఈ మూవీ చూసిన దర్శకులందరూ గుండె బరువెక్కి ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ సినిమాతో మళ్ళీ ‘కృష్ణ వంశీ ఈజ్ బ్యాక్’ అని సాలీడ్ రెస్పాన్స్ ఇచ్చారు.

    కృష్ణ వంశీ సినిమా అంటే లవ్, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్స్..ఇలా ప్రతీ ఒక్కటీ సమపాళ్ళలో ఉంటాయి. ఈ సినిమాలో అవన్నీ రెట్టింపు స్థాయిలో చూపించబోతున్నారు. ఈ క్రియేటివ్ డైరెక్టర్ రూపొందించిన గులాబి, నిన్నే పెళ్ళాడతా, అంతఃపురం, ఖడ్గం, మురారి లాంటి అద్భుతమైన చిత్రాల కంటే ఇంకో మెట్టు పైనే ఉండేలా రంగమార్తాండ నిలవబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదని అందరూ ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి లెజండరీ యాక్టర్ ఈ మూవీకి వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాదు..కృష్ణ వంశీ కెరీర్‌లో టాప్ టెన్ మూవీస్ లో నిలుస్తుందని చెప్పడం గొప్ప విషయం. ప్రస్తుతం సినీ ప్రేక్షకులందరూ రంగమార్తాండ రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.