Wed. Jan 21st, 2026

    Viral: భారతీయ సమాజంలో కొన్ని రకాల సంప్రదాయాలు ఉంటాయి. చాలా విచిత్రమైన ఈ సంప్రదాయాలు అనాదికాలం నుంచి వస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో ఇలాంటి సంప్రదాయ పండుగలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అలాంటి ఓ వింత పండగ కొట్టంకూలంగర చమయవిళక్కు వేడుక. ప్రతి ఏడాది మార్చి నెలలో మీనా మాసంలో జరుగుతుంది. ఈ పండగ ప్రత్యేకత ఏంటంటే మగాళ్ళు అందరూ కూడా ఆడవాళ్ళు తరహాలో ముస్తాభై దీపాలు కొట్టంకూలంగర అమ్మవారి ఆలయంలో దీపాలు పెట్టి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక ఆ చుట్టూ పక్కల ప్రాంతాలలో వేలాది మంది ఈ సంప్రదాయ వేడుకలో పాల్గొంటారు.

    At This Kerala Temple's Annual Festival, Men Dress Up As Women For A Day

    చీరకట్టులో భాగా ముస్తాభై, నిండుగా నగలు వేసుకొని ఆడవాళ్ళ తరహాలో మ్యకప్ లు వేసుకుంటారు. కొంతమంది ప్రొఫెషనల్ మ్యాకప్ ఆర్టిస్ట్ లతో మ్యాకప్ వేయించుకొని ఆడవాళ్ళ తరహాలో రెడీ అవుతారు. దీనికి కారణం కూడా ఉంది. ఇక్కడ అందంగా ముస్తాబై వచ్చిన మగవారికి పోటీలు కూడా నిర్వహిస్తారు. ఆ పోటీలలో ఎవరు అందంగా ఉన్నారో వారికి బహుమతులు ఇస్తారు. ఈ కారణంగా చాలా మంది యువత ఈ వేడుకలో స్త్రీ వేషధారణలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.ఇక తాజాగా ఈ వేడుకలో జరిగిన అందాల పోటీలలో ఒకామె విన్నర్ గా నిలిచింది.

    Image

    ఇప్పుడు ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ఆమెలా  ముస్తాభైన అతడి అందంలో అమ్మాయిలకి ఏ మాత్రం తీసిపోని విధంగా మెరిసిపోవడంతో ఒక అధికారి ఆ ఫోటో ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో ఆ ఫోటోపై నెటిజన్లు ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేస్తూ వైరల్ చేసేశారు. దీంతో అమ్మాయి గెటప్ లో ఉన్న ఆ అబ్బాయి రాత్రికి రాత్రి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయాడు. అతను ఎవరనేది తెలుసుకోవడానికి ఆరా తీస్తున్నారు. అందాల పోటీలు నిర్వహిస్తే ఆడవాళ్ళు బీట్ చేసేసి విధంగా మగవారి రూప లావణ్యం ఉంటుందని ఇలాంటి సంఘటనలు చూసినపుడు అనిపిస్తూ ఉంటుంది అని సోషల్ మీడియాలో చర్చించుకోవడం విశేషం.