Kota Srinivasara Rao: సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంత మంది సెన్సేషన్ కోసం రూమర్స్ క్రియేట్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల మీద ఇష్టానుసారంగా రూమర్స్ క్రియేట్ చేయడం అలవాటుగా మారిపోయింది. కలిసి ఉన్న భార్యాభర్తలని విడిపోతున్నారు అంటూ ప్రచారం చేస్తారు. అలాగే సెలబ్రిటీల మధ్య లేని ప్రేమ వ్యవహారాలని పుట్టిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఈ గాసిప్స్ కి క్లారిటీ ఇచ్చుకునే సరికి వారికి సరిపోతుంది. ఇలాంటి తప్పుడు ప్రచారాల నేపధ్యంలోనే సెలబ్రిటీలు పీఆర్ టీమ్ లని పెట్టుకొని వారితో క్లారిటీ ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
కొంత మంది బ్రతికున్న సెలబ్రిటీలని చంపేసి రిప్ పోస్టులు పెడతారు. అవి వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అలానే తాజాగా సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు చనిపోయాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని పేజీల ద్వారా తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. ఆయనకి రిప్ ప్రకటిస్తూ పోస్టులు పెట్టారు. ఇక బ్లూ టిక్ మార్క్ ఉన్న పేజీల ద్వారా ఈ ప్రచారం జరగడంతో నిజమే అనుకోని పోలీసులు కూడా కోటా శ్రీనివాసరావు ఇంటికి చేరుకున్నారు.. అదే సమయంలో చాలా మంది వ్యక్తిగతంగా అతని ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు.
ఇక ఉదయం నుంచి మొదలైన ఈ తప్పుడు ప్రచారానికి కోటా శ్రీనివాసరావు నేరుగా ఒక వీడియో విడుదల చేసి ఫుల్ స్టాప్ పెట్టారు. నేను చనిపోలేదు అని తనకు తానే క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం కోటా శ్రినివాసరావుకి వచ్చింది. అదే సమయంలో తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోటాశ్రీనివాసరావు రిక్వెస్ట్ చేశారు. బ్రతికుండగానే చంపేసి ప్రజల ప్రాణాలతో ప్రచారాలు తెచ్చుకోవాలని ప్రయత్నం చేయొద్దు అంటూ విమర్శించారు.