Value of rupee: డబ్బుకి లోకం దాసోహం అని ఎప్పుడో దశాబ్దాల క్రితం ఒక మహాకవి అద్బుతమైన మాట చెప్పారు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనే సూక్తి కూడా జన ప్రాచూర్యంలో ఉంది. ప్రపంచంలో చాలా నేరాలు, ఘోరాలు డబ్బు కోసమే జరుగుతున్నాయి, డబ్బుతో ముడిపడి జరుగుతున్నాయి అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డబ్బు కోసం ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఉదయం లేచింది మొదలు నిద్రపోయే వరకు యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఆ యుద్ధం ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో విధంగా ఉంటుంది. పేదవాడు రోజు వారి జీవితాన్ని గడపడం కోసం డబ్బు సంపాదిస్తున్నాడు. మధ్యతరగతి ప్రజలు కుటుంబ పోషణ, వ్యక్తిగత భద్రత కోసం డబ్బుని కోరుకుంటున్నారు. ధనికులు అయితే భవిష్యత్తు కోసం డబ్బుని సృష్టిస్తున్నారు.
ఇక్కడ డబ్బు విషయంలో ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే డబ్బుని సంపాదించడం కూడా ఒక కళ అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. చాణిక్యుడి అర్ధశాస్త్రంలో కూడా డబ్బు గురించి చాలా గొప్ప విషయాలు చెప్పారు. ముఖ్యంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉందంటే రూపాయితో స్నేహం చేయడం మొదలు పెట్టాలి. ఒక వ్యక్తితో స్నేహం చేస్తే ఆ స్నేహం మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది అనే విషయం అందరికి తెలిసిందే. అలాగే రూపాయితో కూడా నిజాయితేగా స్నేహం చేయాలి. ఆ రూపాయిని గౌరవించాలి. ఖర్చు పెట్టె ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి. ఆ లెక్క నీకు నువ్వే చెప్పుకోవాలి. ఒక్కసారి రూపాయితో స్నేహం చేయడం మొదలు పెడితే జీవితంలో ఆ రూపాయి మనల్ని వదిలి ఎక్కడికి పోదు.
అలా కాకుండా ఆర్ధికపరమైన ఆలోచనలు లేకుండా నిర్లక్ష్యంగా దానదర్మాలు చేయకూడదు. అనవసరంగా ఖర్చు చేయకూడదు. ఖర్చు పెట్టె ప్రతి రూపాయికి లెక్క ఉండాలి. డబ్బుని ఎప్పుడు కూడా నిజాయితీతో మన సామర్ధ్యంతో సంపాదించాలి కాని తప్పుడు మార్గంలో సంపాదించే ప్రయత్నం చేయకూడదు. నిజాయితీగా సంపాదించే రూపాయికి స్థిరత్వం ఎక్కువ ఉంటుంది. తప్పుడు మార్గంలో సంపాదించే ప్రతి రూపాయికి ప్రకృతి, చట్టం లెక్క కడుతుంది. అన్నింటికీ ఒకేసారి సమాధానం చెప్పి మనల్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. లక్ష్మి కటాక్షం ఉండాలంటే ఆ లక్ష్మిదేవి రూపం అయిన రూపాయిపై గౌరవం ఉండాలి, ఆ రూపాయిని మన ప్రాణ స్నేహితుడిగా మార్చుకోవాలి. ఈ ఆర్ధికపరమైన ఆలోచనలు డబ్బుని ఆకర్షిస్థాయి. మనల్ని ఈ సమాజంలో ధనవంతుడిగా పరిచయం చేస్తాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.