Sambrami doop: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇంట్లో ప్రతిరోజు పూజా కార్యక్రమాలను చేస్తూ ఉంటాము ఇలా ఉదయం సాయంత్రం దేవుడి గదిలో దీపాలను వెలిగించి దీపారాధన చేయటం వల్ల ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందని సుఖసంతోషాలు ఉంటాయని భావిస్తూ ఉంటారు. ఇక వారంలో ఏదో ఒక రోజు వారి ఇష్ట దైవానికి ప్రత్యేకంగా పూజలు చేసి ఇంట్లో కర్పూర హారతులు ఇవ్వడం సాంబ్రాణి ధూపం వేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయానికి వస్తే..
ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఇల్లు మొత్తం ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావం మొత్తం బయటకు వెళ్లిపోయి మన ఇంట్లో అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇంట్లో ఏ విధమైనటువంటి ధూపం వేయటం వల్ల మన ఇంటిపై చెడు దృష్టిపడిన ఆ దిష్టి మొత్తం తొలగిపోతుంది.
శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేసిన అనంతరం కర్పూర హారతిని ఇచ్చి అనంతరం ఇల్లు మొత్తం సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది.అంతే కాకుండా ఇంట్లో పలు శుభకార్యాలు జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది అయితే వారంలో ఒక్కసారి మాత్రమే కాకుండా మనకు వీలు కలిగితే ప్రతిరోజు కొంత మొత్తంలో సాంబ్రాణి ధూపం ఇల్లు మొత్తం వేయటం వల్ల ఇంట్లో సకల సంపదలు కలగడమే కాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవని పండితులు చెబుతున్నారు.