Thu. Feb 12th, 2026

    Kiara Advani – sidharth Malhotra : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. సహ నటుడు సిద్దార్థ్ మల్‌హోత్రాను ఈ బ్యూటీ పెళ్ళి చేసుకోబోతున్న సంగతి అందరికీ తెలిసందే. గత కొంతకాలంగా ప్రేమ పక్షుల్లా తిరుగుతున్న కియారా, సిద్దార్థ్ పెళ్లి పీటల వరకూ వెళ్ళరని అందరూ కామెంట్స్ చేశారు. కానీ, అవన్నీ పుకార్లేనని తేలిపోయింది. హిందీలో లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌తో బాగా పాపులర్ అయిన కియారా, ఆ తర్వాత కబీర్ సింగ్ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారింది.

    kiara-advani-sidharth-malhotra-is-kiara-going-to-stop-movies-after-her-marriage
    kiara-advani-sidharth-malhotra-is-kiara-going-to-stop-movies-after-her-marriage

    ఈ సినిమా తర్వాత హిందీ సీమలో వరుసగా సినిమాలు చేస్తూ నంబర్ 1 స్థానానికి చేరుకుంది. బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్‌కి జోడీగా కియారా చేసిన సినిమాలు దాదాపు బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధించాయి. తెలుగులోనూ అమ్మడు హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియారా, ఆ సినిమాతో భారీ హిట్ అందుకుంది.

    Kiara Advani – sidharth Malhotra : కియారా అద్వానీ RC 15 కంప్లీట్ చేస్తుందా..?

    కానీ, రెండవ సినిమా మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో మళ్ళీ తెలుగులో నటించలేదు. చెప్పాలంటే హిందీలో విపరీతమైన బిజీగా ఉండటమే దీనికి కారణం. ఇక శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా RC 15 తో మళ్ళీ తెలుగు తెరమీద కనిపించబోతోంది. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది.

    kiara-advani-sidharth-malhotra-is-kiara-going-to-stop-movies-after-her-marriage
    kiara-advani-sidharth-malhotra-is-kiara-going-to-stop-movies-after-her-marriage

    ఇప్పుడేమో అమ్మడు పెళ్లి చేసుకోబోతోంది. దాంతో కియారా అద్వానీ RC 15 కంప్లీట్ చేస్తుందా..? అనే సందేహాలు చాలామందిలో మొదలయ్యాయి. కానీ, చిత్ర యూనిట్ నుంచి అందుతున్న సమాచారం మేరకి ఇప్పటి వరకూ కమిటైన సినిమాలను పూర్తి చేస్తుందట. ఫ్యూచర్‌లో కూడా హీరోయిన్‌గా కొనసాగనుందని బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న లేటెస్ట్ న్యూస్. కాబట్టి ఆర్సీ 15 విషయంలో కియారా గురించి వస్తున్నవన్నీ రూమర్లే అనుకోవచ్చు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.