Keshineni Nani: ఏపీలో బెజవాడ కేంద్రంగా తెలుగుదేశం పార్టీలో కేశినేని నాని పెద్ద హాట్ టాపిక్ గా మారారు. చాలా కాలం నుంచి కేశినేని నాని చంద్రబాబుతో కొన్ని విషయాలలో విభేదిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా విజయవాడలో బుడ్డా వెంకన్న, బొండా ఉమా లాంటివారిని టీడీపీ ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. అయితే వీరితో కేశినేని నానికి తీవ్ర విభేదాలు ఉన్నాయి. దీంతో తరుచుగా వారి మీద పరోక్షంగా నాని తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేతో కేశినేని మాట్లాడటం, అతనిని ప్రశంసించడం పెద్ద చర్చానీయాంశంగా మారింది. అప్పటి నుంచి టీడీపీలోని బుద్ధ వెంకన్న లాంటి నాయకులు కేశినేని నానిపై విమర్శలు చేస్తున్నారు.
మరో వైపు టీడీపీలో కేశినేనికి పోటీగా అతని తమ్ముడు చిన్నిని అధిష్టానం ప్రోత్సహిస్తూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా నానికి మింగుడుపడటం లేదు. దీంతో అధిష్టానంపై ఎప్పటికప్పుడు తన అసహనం చూపిస్తూనే ఉన్నారు. ఈ మధ్య వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ టీడీపీకి తలనొప్పిగా మారిపోయారు. టీడీపీ టికెట్ ఇవ్వకపోయిన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రజలు ఆశీర్వాదంతో గెలుస్తానని చాలెంజ్ చేశాడు. తద్వారా టీడీపీ పార్టీ తనని పక్కన పెట్టిన కూడా లెక్కచేసేది లేదని చెబుతున్నారు. మరోవైపు అతనికి వైసీపీ నాయకుల నుంచి కూడా ఆహ్వానం అందుతుందనే ప్రచారం నడుస్తోంది.
వైసీపీ నాయకులు ఈ మధ్య బయట, సోషల్ మీడియాలో కూడా కేశినేని నానిని హైలైట్ చేస్తూ టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. పేర్ని నాని, కొడాలి నానికి కేశినేని నాని కూడా తోడైతే ఇక టీడీపీ తట్టుకోలేదు అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తూ సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే కేశినేని విషయంలో చంద్రబాబు మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నారు. అలాగే పరోక్షంగా కేశినేనికి ఫుల్ స్టాప్ పెట్టె వ్యూహంలో ఉన్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. మొత్తానికి ఎన్నికలు సమీపించే సమయంలో బెజవాడలో కేశినేని వ్యవహారం టీడీపీకి కొత్త తలనొప్పులు తీసుకోస్తోందని చెప్పొచ్చు. దీనికి బాబు ఎలా ఫుల్ స్టాప్ పెడతాడు అనేది చూడాలి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.